2019 ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం 175 స్థానాల్లో పోటీ చేసి, కేవలం 23 సీట్లు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే 175 స్థానాల్లో టీడీపీ డిపాజిట్ కోల్పోయి, పరువు పోగొట్టుకున్న నియోజకవర్గం ఏదైనా ఉందటే అది విశాఖ జిల్లాలోని అరకు అసెంబ్లీ స్థానమే. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన కిడారి శ్రవణ్ కుమార్ కేవలం 20 వేల లోపు ఓట్లు తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయారు.

 

ఈయనపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్ధి చెట్టి ఫాల్గుణ 53 వేలు ఓట్లు తెచ్చుకుని విజయం సాధిస్తే, వైసీపీ రెబల్ అభ్యర్ధిగా పోటీ చేసిన దొన్ను దొర 27 వేలు ఓట్లు తెచ్చుకుని రెండో స్థానంలో నిలిచారు. అయితే శ్రవణ్ ఇలా డిపాజిట్లు కోల్పోవడానికి, అక్కడ టీడీపీ మీద ఉన్న వ్యతిరేకితే ప్రధాన కారణంగా ఉంది. 2014 ఎన్నికల్లో శ్రవణ్ తండ్రి కిడారి సర్వేశ్వరరావు వైసీపీ నుంచి గెలిచి విజయం సాధించారు.

 

తర్వాత బాబు ఆపరేషన్‌లో భాగంగా టీడీపీలోకి వచ్చారు. అయితే అనూహ్యంగా నియోజకవర్గ పర్యటనలో ఉన్న సమయంలో నక్సలైట్ల కాల్పుల్లో సర్వేశ్వరరావు మృతి చెందారు. అయితే సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతుండటంతో అరకులో ఉపఎన్నిక జరగలేదు. దీంతో బాబు, శ్రవణ్‌కు మంత్రి పదవి ఇచ్చారు. అయితే ఆరు నెలల్లోపు ఏదొక ఎమ్మెల్యే గానీ, ఎమ్మెల్సీ గానీ అయితేనే పదవి ఉంటుంది. కానీ బాబు ఎమ్మెల్సీ పదవి ఏం ఇవ్వలేదు.

 

దీంతో ఎన్నికల ముందు శ్రవణ్ పదవికి రాజీనామా చేసి, ఎన్నికల బరిలో నిల్చుని ఘోరంగా ఓడిపోయారు. టీడీపీ మీద బాగా వ్యతిరేకిత పెరగడంతో శ్రవణ్ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోకుండా చతికలపడ్డారు. అయితే డిపాజిట్ కోల్పోయిన టీడీపీలోనే కొనసాగుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే అరకులో టీడీపీ గెలుపు అనేది చాలా కష్టం.

 

ఈ గిరిజన ప్రాంతం వైసీపీకి కంచుకోట. మరి ఇలా ఉన్న అరకులో శ్రవణ్ పరిస్థితి ఏంటో అర్ధం కాకుండా ఉంది. ఇప్పుడుప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన శ్రవణ్‌కు రాజకీయ భవిష్యత్ ఉండటం కష్టమనిపిస్తుంది. మరి బాబు...శ్రవణ్‌ భవిష్యత్‌ని ఏ విధంగా నిలబెడతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: