నందమూరి బాలక్రిష్ణ టాలీవుడ్ టాప్  ఫోర్ సీనియర్ హీరోల్లో ఒకరు. ఆయన రూటే సెపరేట్. మిగిలిన హీరోలెవరూ టచ్ చేయని జోనర్లు టచ్ చేసి తన‌ తరంలో ఆల్ ఇన్ వన్ అనిపించుకున్నారు. బాలయ్య అన్ని పాత్రలకూ సూట్ అవుతారన్న ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ఇక బాలయ్యకు ఎన్నో రికార్డులు ఉన్నాయి. వాటిని మిగిలిన హీరోలు అధిగమించడమూ కష్టమే.

 

బాలయ్య ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికి 46 ఏళ్ళు అవుతోంది. ఆయన విజయశాంతి, రోజా, రాధ వంటి వారితో ఎక్కువగా సినిమాలు చేశారు. ఇక ఇప్పటి హీరోయిన్లతో కూడా ఆయన ఒకటికి రెండు సార్లు చేస్తూ మిగిలిన హీరోలకు షాక్ ఇస్తున్నారు. బాలయ్య బోయపాటి మూవీలో శ్రియ నటిస్తోందని అంటున్నారు. అదే జరిగితే నందమూరి అందగాడితో ఆమె నాలుగవ‌సారి జత కడుతుందని అనుకోవాలి.

 

ఇక అంజలి కూడా రెండవసారి ఇదే మూవీలో బాలయ్యకు జోడీ అవుతోందిట. వీరిద్దరూ  ఉండగానే మరో భామ పేరు కూడా వినిపిస్తోంది.  అప్పట్లో  రెయిన్ బో మూవీ ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సోనాల్ చౌహాన్ కొత్త మూవీలో తళుక్కున మెరిసే అవకాశం ఉందని అంటున్నారు. బాలయ్య మళ్ళీ ఆమెతో జోడీ కట్టాలనుకుంటున్నాడుట.

 

ఇప్పటికే ఆమె లెజెండ్, డిక్టేటర్, రూలర్ మూవీస్ లో బాలయ్యతో జత కట్టింది. ఇపుడు ఆమె కూడా ఉంటే బాగుంటుందని బాలయ్య సూచిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆమె కనుక వచ్చి చేరితే బాలయ్య సోనాల్ తో కూడా నాలుగవసారి జంట కట్టినట్లు అవుతుంది. మొత్తానికి బాలయ్య అటు సెంటిమెంట్లను, ఇటు అందలా భామలను కలుపుకుంటూ కొత్త సినిమా కోసం గట్టిగానే కష్టపడుతున్నారని అంటున్నారు.  

 

బోయపాటి, బాలయ్య కాంబోలో హ్యాట్రిక్ మూవీ కావడంతో అంచనాలూ ఎక్కువగానే ఉన్నాయి. దాంతో బాలయ్య దగ్గరుండి కాస్టింగ్ విషయంలో అన్నీ చూసుకుంటున్నాడని టాక్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: