చక్రం అనగానే ఎవర్ గ్రీన్ చక్రధారి చంద్రబాబే అందరికీ గుర్తుకువస్తారు. ఆయన ఒకటికి పదిసార్లు చెప్పుకుంటారు తాను జాతీయ స్థాయిలో చక్రం తిప్పానని. రాష్ట్రపతులను, ప్రధానులను తానే ఎంపిక చేశానని, బాబుది నాలుగు దశాబ్దాల  రాజకీయ అనుభవం. ముమ్మారు సీఎంగా అనిచేసిన వైనం. టీడీపీకి పాతికేళ్ళుగా తెర ముందు, అంతకు ముందు పద్నాలుగేళ్ళుగా తెరవెనక సారధ్యం వహించిన నైపుణ్యం ఇవన్నీ బాబు ఆస్తులు, భుజకీర్తులు.

 

మరి జగన్ విషయం తీసుకుంటే బాబుతో ఈ విషయాల్లో పోల్చ‌లేం. కానీ జగన్ కష్టాన్ని నమ్ముకుని పదేళ్ళ రాజకీయంతోనే తాను కోరుకున్న ముఖ్యమంత్రి  పీఠం ఎక్కగలిగారు. జగన్ కి అపరిమితమైన జనాదరణ ఉంది. బంపర్ మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో బలమైన నేతగా ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో ఇపుడు జగన్ చక్రమే గిర్రున తిరుగుతోంది. 

 

ఇకపైన జాతీయ రాజకీయాల్లో కూడా  జగన్నాధ రధ చక్రం వేగంగా   తిరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అది కూడ ఈ ఏప్రిల్ నుంచే మొదలవుతుందని చెబుతున్నారు. ఏప్రిల్ లో ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ సీట్లూ వైసీపీ గెలుచుకుంటుంది. దాంతో ఆరు ఎంపీలు పెద్దల సభలో జగన్ కి జమ అవుతారు. ఆ తరువాత 2022 నాటికి మరో నాలుగు, 2024 నాటికి మరో నాలుగు ఎంపీ సీట్లు జగన్ పరం అవుతాయి. టోటల్  గా 2024 ఏప్రిల్ నెల అంటే సార్వత్రిక ఎన్నికలకు ముందు పన్నెండు మంది ఎంపీలతో జగన్ పెద్దల సభలో అతి పెద్ద ప్రాంతీయ పార్టీగా నిలిస్తారని అంటున్నారు.

 

ఆ సమయానికి ఏ ప్రాంతీయ పార్టీకి అన్ని సీట్లు దక్కవని అంటున్నారు. దాంతో జగన్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు అవకాశాలన్నీ వేచి ఉంటాయని చెబుతున్నారు. జగన్ జాగ్రత్తగా అడుగులు వేస్తే మరో మారు ఏపీకి సీఎం కావచ్చు. అదే సమయంలో జాతీయ స్థాయిలో ఆయన తన బలాన్ని పెంచుకుంటూ పోతే మరో నాలుగేళ్ళతో మారుతున్న దేశ రాజకీయ ముఖ చిత్రంలో జగన్ అజేయమైన నూతన నేతగా అవతరిస్తారని రాజకీయ పండితులు జోస్యం చెబుతున్నారు.

 

జగన్ కి పెద్ద ప్లస్ పాయింట్ ఆయన వయసు.  ఆయన ఇపుడు 47 ఏళ్ళ వయసులో  ఉన్నారు. మరో నాలుగేళ్ళకు 50 ప్లస్ కి చేరువ అవుతారు. ఇపుడు జాతీయ స్థాయిలో  ఉన్న వారంతా మరో అయిదారేళ్ళలో రిటైర్ కాక తప్పని పరిస్థితి. దాంతో జగన్ తలచుకుంటే ఢిల్లీ పాలిటిక్స్ ని కూడా ప్రభావితం చేస్తారని అంటున్నారు. మొత్తానికి కొత్త చక్రధారి జగన్ అన్నది పక్కా క్లారిటీగా చెప్పేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: