నారావారి సుపుత్రుడు లోకేష్ లేక లేక ఇచ్చిన ఓ విందు రాజకీయం రివర్సయిపోయిందా ?  పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. చినబాబు లోకేష్ పార్టీలోని యువత నేతల పేరుతో జరిపిన విందు రాజకీయంపై పార్టీలోనే పెద్ద దుమారం రేగిపోతందట. కేవలం వారసులను మాత్రమే విందుకు ఆహ్వానించి వాళ్ళే పార్టీకి, వాళ్ళతోనే రాష్ట్రానికి భవిష్యత్తంటూ లోకేష్ ఇచ్చిన బిల్డపై పార్టీ అభిమానులు ఓ రేంజిలో రెచ్చిపోతున్నారట.

 

ఆదివారం హైదరాబాద్ లోని తనింట్లో లోకేష్, బ్రాహ్మణి దంపతులు విందు ఇచ్చారు. దీనికి పార్టీలోని సీనియర్ల వారుసులు సుమారు 35 జంటలను పిలిచారు. ఇక్కడ జంటలంటే వారసుల దంపతులని అర్ధం. వీళ్ళతో సుమారు ఆరు గంటల పాటు లోకేష్ దంపతులు చాలా ఉల్లాసంగా గడిపారు లేండి. ఇదే విందుకు చంద్రబాబనాయుడు, భువనేశ్వరి కూడా హాజరయ్యారు. ఇదంతా బాగానే ఉంది. కానీ విందుకు హాజరైన వారితో గ్రూపు ఫొటోలు కూడా  దిగారు. ఇక్కడే అసలు ట్విస్టు మొదలైంది.

 

విందుకు హాజరైన వారసులు ఫొటోలకు ఫోజులిచ్చిన తర్వాత ఊరికే ఉండరు కదా ? వాటిని తమ సోషల్ నెట్ వర్క్ లో పోస్టు చేశారు. దాంతో సీన్ ఒక్కసారిగా రివర్సయిపోయింది. ఆ ఫొటోలను చూసిన  పార్టీ అభిమానులు, నెటిజన్లు లోకేష్ పై ఓ రేంజిలో ఫైర్ అయిపోతున్నారు. వారసులను విందుకు పిలిచి వీళ్ళ వల్లే పార్టీ, రాష్ట్రానికి భవిష్యత్తంటూ ఇంత చెత్తగా ఎలా ఆలోచిస్తున్నవాంటూ లోకేష్ ను కబడ్డీ ఆడేసుకున్నారు.  వాళ్ళ తాతలు, తండ్రులు, తల్లలను తీసేస్తే వారసులుగా పార్టీకి వీళ్ళు ఏ విధంగా పనికొస్తారంటూ నెటిజన్లు లోకేష్ ను సూటిగా ప్రశ్నించారు.

 

వీళ్ళ సీనియర్లు లేకపోతే వీళ్ళసలు దేనికైనా పనికొస్తారా ? అంటూ మరికొందరు మండిపడిపోయారు. పార్టీ అధికారంలో ఉన్నపుడు సీనియర్లను  అడ్డు పెట్టుకుని వీళ్ళ అరాచకాలను జనాలు ఎలా మరచిపోతారంటూ ఇంకొందరు చినబాబుపై మండిపడ్డారు. అసలు వారసత్వంతో  తప్ప స్వయంశక్తితో ఎదిగిన యువనేత ఒక్కడు కూడా పార్టీలో  లేడా ? అంటూ మరికొందరు ఆశ్చర్యపోయారు.

 

ఒకవైపు అమరావతి పరిరక్షణ పేరుతో రైతులు 75 రోజులుగా దీక్షలు చేస్తుంటే మీకు విందులు కావాల్సొచ్చిందా ? అంటూ మరికొందరు లోకేష్ పై మండిపడిపోయారు.  లోకేష్ ఇచ్చిన విందుకు  పార్టీ అభిమానులు, నెటిజన్ల రియాక్షన్లు ఇపుడు పార్టీలో పెద్ద చర్చగా మారింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: