నారావారి పుత్రరత్నం లోకేష్ నాయుడుకు చినవయస్సులోనే షార్ట్ మెమొరీ లాస్ వచ్చేసినట్లుంది. వ్యవహారికంగా ఈ సమస్యను అందరూ ముద్దుగా గజనీ లాగ అయిపోయాడని చెప్పుకుంటుంటారు లేండి.  తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో  తెలుగు రైతు వర్క్ షాపు జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు కామెంట్లు చేశాడు. దాంతోనే లోకేష్ కూడా గజనీ లాగ అయిపోతున్నాడనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

ఇంతకీ లోకేష్ ప్రస్తావించిన చాలా అంశాల్లో ప్రధానమైనవి ఏమిటంటే రైతు కంట కన్నీరు రాష్ట్రానికి అరిష్టమట. ఇక రెండో విషయం ఏమిటంటే రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నంకు తరలించే విషయంలో అసలు రైతులతో జగన్ మాట్లాడలేదట. లోకేష్ ప్రస్తావించిన రెండు విషయాలు కూడా చాలా విచిత్రంగానే ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబునాయుడు హయాంలో ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది బహుశా చినబాబు మరచిపోయినట్లున్నాడు.

 

వ్యవసాయం దండగ అని ప్రకటించి రైతు వ్యతిరేకి అనే ముద్ర వేయించుకున్నదే చంద్రబాబు. 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ చేస్తానని తప్పుడు హామీలిచ్చి రైతులను మోసం చేసింది  చంద్రబాబే అన్న విషయం చినబాబు మరచిపోయినట్లున్నాడు. అలాంటిది జగన్ పై  రైతు వ్యతిరేకి అనే ముద్ర వేయటానికి లోకేష్ నానా అవస్తలు పడుతున్నాడు. అధికారంలోకి వచ్చేందుకు నోటికొచ్చిన హామీలిచ్చి రైతులనే కాదు అన్నీ వర్గాల జనాలను మోసం చేశాడు కాబట్టే అందరూ కలిసి మొన్న టిడిపి గూబ పగలగొట్టారు.

 

అయినా లోకేష్ కు ఇంకా బుద్ధి వచ్చినట్లు లేదు. ఇక రెండో అంశం రాజధాని తరలింపుపై రైతులతో జగన్ ఎందుకు మాట్లాడలేదు ? అని అడుగుతున్నాడు. పదేళ్ళ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను అర్ధరాత్రి విజయవాడకు తరలించినపుడు చంద్రబాబు ఎవరితో మాట్లాడాడు ? మిగిలిన జనాల విషయాన్ని పక్కనపెడితే కనీసం సచివాలయం ఉద్యోగులతో అయినా మాట్లాడాడా ? ఓటుకునోటు కేసులో అరెస్టుకు భయపడిన చంద్రబాబు విజయవాడకు  పారిపోయి అందరూ విజయవాడకు రావాల్సిందే అంటూ ఆర్డర్ వేయలేదా ? అప్పుడు చంద్రబాబు ఏమి చేశాడో ఇపుడు జగన్ కూడా అదే చేస్తున్నాడు. గజనీ కాబట్టి లోకేష్ కు గుర్తు లేదేమో.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: