రోజురోజుకు జాతీయ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దేశ రాజకీయాల్లో దిగ  జారిపోతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు తిరుగులేని పార్టీగా మకుటం లేని మహారాజు అన్నట్లుగా ప్రస్థానాన్ని  కొనసాగించిన  కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు మాత్రం సంక్లిష్ట పరిస్థితుల్లో పడిపోతుంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ సత్తా చాట లేకపోతుంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో అయితే ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. కనీసం బోనీ కూడా కొట్ట  లేకపోయింది. దీంతో ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పునర్ వైభవం తెచ్చేందుకు సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల ముందు గుజరాత్ లో బిజెపి ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు  కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. 

 

 

 

 అయితే సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు మాట్లాడుతూ.. గుజరాత్ ప్రస్తుత డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ కు బంపర్ ఆఫర్ ప్రకటించారు. 20 మంది ఎమ్మెల్యేలను నితిన్ పటేల్ తన వెంట తీసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు అయితే... ఏకంగా  ముఖ్యమంత్రి పదవిని కట్టబెడతం అని  ప్రకటించారు. అయితే కాంగ్రెస్ నేత ఇలాంటి బంపర్ ఆఫర్ ప్రకటించడంపై ఒక్కసారిగా అధికార పార్టీలో కలవరం మొదలైంది. దీంతో పాటు అధికార పార్టీలో కూడా ముందు జాగ్రత్త వ్యూహాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ బంపర్ ఆఫర్ కు బిజెపి ఎమ్మెల్యేలు ఎవరు ఆకర్షితులు కాకుండా చూసుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ పార్టీ.

 

 

 అయితే ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్ లో 2017 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో... మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను బిజెపి పార్టీ 99 స్థానాల్లో విజయకేతనం ఎగుర  వేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఎన్నికల పోరు ఎంతో ఉత్కంఠగా సాగింది ఎందుకంటే ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ కూటమి కూడా 77 స్థానాలను దక్కించుకుంది. కాగా  మరికొద్ది రోజుల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... గుజరాత్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఎంతో  కీలకంగా మారనుంది . ఈ క్రమంలోనే రాజ్యసభ ఎన్నికలకు ముందే బిజెపి సభ్యులను తమ పార్టీలోకి ఆకర్షించి.. ప్రబుత్వన్మి ఏర్పాటు చేయాలనీ  ప్రణాళికలు వ్యూహాలతో ముందుకు సాగుతుంది కాంగ్రెస్ పార్టీ. చూడాలి మరి ముందు ముందు గుజరాత్ రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో.

మరింత సమాచారం తెలుసుకోండి: