ఇద్దరు మిత్రులు గా పేరు పొంది, పరిపాలనలోనూ, పార్టీలోనూ ఒకే రకమైన ఆలోచనలను అమలు చేస్తూ .. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతూ, ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్. ఇక ఈ రెండు రాష్ట్రాల సమస్యల విషయంలోనూ ఒకరికొకరు సామరస్యపూర్వకంగా ఇరు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ విషయంలో జగన్ కు కేసీఆర్, కెసిఆర్ కు జగన్ ఇలా ఒకరికొకరు అండగా ఉంటూ వస్తున్నారు. తాజాగా కెసిఆర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు జగన్ ఇరుకున పెట్టేలా కనిపిస్తోంది.

 

IHG


 కేంద్రం తీసుకువచ్చిన సిఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే క్యాబినెట్ లో తీర్మానం కూడా చేసింది. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోయే బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన తీర్మానం కూడా ప్రవేశపెట్టి, వెంటనే ఆమోదింపజేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ తీర్మానం కనుక అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ సంగతి పక్కన పెడితే ఆ ప్రభావం ఖచ్చితంగా ఏపీపైన పడుతుంది. ఇప్పటికే వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో సిఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకించాలని జగన్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పుడు గుంటూరులో జరిగిన సమావేశంలో వైసిపి మైనార్టీ ఎమ్మెల్యే ముస్తఫా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

IHG


ఏపీ అసెంబ్లీ లో సిఏ ఏ, ఎన్ఆర్సీకి  వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టకపోతే తన ఎమ్మెల్యే పదవికి తో పాటు, పార్టీకి కూడా రాజీనామా చేస్తానంటూ హెచ్చరికలు చేశారు. ఇప్పటికే ఈ విషయంలో జగన్ తీవ్రంగా ఒత్తిడికి గురవుతున్నారు. కేంద్రం తీసుకువచ్చిన ఈ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేస్తే కేంద్రం ఆగ్రహానికి తప్పకుండా వైసీపీ ప్రభుత్వం గురవుతుంది. ఒకవేళ చేయకపోతే వైసీపీలో ఉన్న మైనార్టీ నాయకులు పార్టీపై అసంతృప్తితో ఉంటారు . ఇలా రెండు వైపులా చూసినా జగన్ కు ఇది ఇబ్బందికర పరిణామాలు తెచ్చేలా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: