అంతర్జాతీయంగా ప్రజలందరినీ భయాందోళనలకు గురి చేస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19) ఇప్పుడు హైదరాబాద్ కు వచ్చింది. మొట్టమొదటిసారిగా కరోనా కేసు కేరళలో నమోదు కాగా ఇప్పటి వరకు దేశంలో ఉన్న మూడు కేసులు రాష్ట్రంలోనే నమోదయ్యాయి. కానీ రోజు చాలా ఆశ్చర్యకరంగా దేశంలో మూడు కరోనా వైరస్ సోకిన వ్యక్తులను గుర్తించారు. ఒకరు దేశ రాజధాని ఢిల్లీలో ఉండగా మరొకరిని తెలంగాణ రాజధాని హైదరాబాదులో గుర్తించారు. తాజాగా మూడవ కేసును జైపూర్ లో గుర్తించారు.

 

IHG

 

అయితే హైదరాబాద్ లోని మహేంద్ర హిల్స్ ప్రాంతంలో నివసిస్తున్న కరోనా వైరస్ సోకిన వ్యక్తి బెంగుళూరులో ఉన్న ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. బెంగళూర్ లో పనిచేస్తున్న సదరు ఉద్యోగి పని నిమిత్తం ఫిబ్రవరి 15 దుబాయ్ వెళ్లి తిరిగి బెంగళూరుకు వచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ కు వచ్చాడు. అయితే దుబాయ్ లో అతను హాంకాంగ్ వారిని కలిశాడని చెప్పాడు.

 

హైదరాబాద్ కు వచ్చిన తర్వాత అతనికి జ్వరం రావడంతో వైద్య పరీక్షలు చేయించుకుని మందులు వాడినా తగ్గకపోవడంతో ఆదివారం గాంధీ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. అతని రక్త నమూనాలను పూణే పంపించగా.... అతనికి ఉన్నట్లు తేలిందని తెలిసి అంతా షాక్ తిన్నారు.

 

IHG

 

ఇకపోతే అతను దుబాయ్ లోనే కరోణ వైరస్ బారిన పడి ఉంటాడని అంతా భావిస్తూ ఉండగా వ్యక్తి బెంగళూరు నుండి హైదరాబాద్ కు బస్సు లో రావడం గమనార్హం. బస్సులో అతనితోపాటు 27మంది ప్రయాణించినట్లు తెలిసింది. తర్వాత అతని కి పరీక్షలు జరిపిన హాస్పిటల్ సిబ్బంది, నర్సులు, డాక్టర్లు, అతని కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు అంతా కలిపి అతనితో 80 మంది కనెక్ట్ అయ్యారు.

 

IHG

 

ఇప్పుడు బస్సులోని 27 మందిలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. వారిలో కర్ణాటక వారు కూడా ఉండడంతో వారందరి వివరాలు సేకరించి అతనితోపాటు కనెక్ట్ కాబడిన 80 మంది ఐసోలేషన్ వార్డ్ కు కు తరలించినట్లు సమాచారం. ఇకపోతే తే మహేంద్ర హిల్స్ చుట్టుపక్కల ప్రాంతాలలోని వారు 80 మందిలో కొంత మంది ఉండగా మరికొందరు గాంధీ ఆసుపత్రిలోని సిబ్బంది ఉన్నారు. ఏదేమైనా వైరస్ ఇకపై ప్రబలకుండా ఇక్కడితో ఆగిపోవాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: