భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగాలతో ఎంతో మంది ప్రజలను ఆకట్టుకున్నారన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ప్రసంగాలు తక్కువగా చేసినప్పటికీ... సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ తన అభిప్రాయాలను వ్యక్త పరుస్తూ ఎంతో మంది అభిమానులను మోటివేట్ చేస్తూ దేశ పరిస్థితులను, స్థితిగతులను చెబుతుంటారు. వాస్తవానికి కేవలం ఒక్క ట్విట్టర్ లోనే మోడీకి ఐదు కోట్ల 36 లక్షల ఫాలోవర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఫేసుబుక్, ఇంస్టాగ్రామ్ సోషల్ వెబ్సైట్లలో ప్రపంచంలోనే మోడీ కి ఉన్న ఫాలోవర్స్ ఏ నేత కి లేరని అంతర్జాతీయ మీడియా సంస్థలే మోడీని కొనియాడుతూ చెప్పుకొచ్చాయి.



ముఖ్యంగా యూట్యూబ్ లో ప్రధాన నరేంద్ర మోడీ ఛానల్ కి 45 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా నరేంద్ర మోడీ ప్రజల కోసం చేసిన ప్రతి పనిని అప్లోడ్ చేస్తారు. అయితే తన అభిమానులు ఈ వీడియోలను చూసి ఆనంద పడుతుంటారు. ఉదాహరణకి వృద్ధులైన సీనియర్ సిటిజన్లకు హెల్ప్ చేయడం, దివ్యాంగులకు స్మార్ట్ ఫోన్ కొని ఇచ్చి మరీ వారితో సెల్ఫీ దిగడం, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే 12000 వీడియోలను నరేంద్ర మోడీ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అందించారు. అయితే ఇప్పటివరకూ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు టచ్లో ఉన్న నరేంద్ర మోడీ ఇక నుండి ప్రజలకు దూరం అవుతారు. ఈ విషయాన్ని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం గమనార్హం.

 




సోమవారం రోజు అనగా నిన్న 08:53 నిమిషాలకు ప్రధాన నరేంద్ర మోడీ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో... 'ఈ ఆదివారం తో నేను సోషల్ మీడియాని వదిలేద్దాం అనుకుంటున్నాను. ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్, ఫేసుబుక్ అకౌంట్స్ లకు వీడ్కోలు త్వరలోనే చెప్పబోతున్నాను. నా అసలైన నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తాను', అని పేర్కొని ఉంది. అయితే ఈ ట్వీట్ పోస్ట్ చేసిన క్షణాల్లోనే లక్షల మంది నెటిజన్లు తీవ్ర షాక్ కి గురయ్యారు. వెంటనే మోడీ ట్వీట్ కి స్పందిస్తూ 'ప్రపంచవ్యాప్తంగా మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు. కావాలంటే మీరు సోషల్ మీడియా నుండి ఒక చిన్న విరామం తీసుకోవచ్చు కానీ శాశ్వతంగా సోషల్ మీడియాని వదిలేయడం సరైంది కాదు', అని ఒకతను రీట్వీట్ చేశాడు.



'దయచేసి ఆ పని చేయకండి. ఈ నిర్ణయంపై మీరు పునరాలోచన చేయండి. మా భావాలను మీకు వ్యక్తపరచడానికి మాకు కష్టమవుతుంది. సోషల్ మీడియా ద్వారానే మీరు సామాన్య ప్రజలకు టచ్లో ఉన్నారు. కైలాసంలో శివుడు ఎలాగో సోషల్ మీడియాలో మీరు కూడా అలాగే', అంటూ మరో వ్యక్తి రాసాడు.

 



' మోడీ జి, మీరు సోషల్ మీడియాని వదిలేయకూడదు. ఎందుకంటే డిజిటల్ ఇండియా ని ప్రతిబింబించేది మీరే. సోషల్ మీడియాలో జిహాదీలు చేసే దుష్ప్రచారాలు, అబద్ధాలు, హింసాత్మక పోస్టుల వలన మీరు ఈ నిర్ణయాన్ని తీసుకోవద్దు. సోషల్ మీడియాలో జరుగుతున్న యాంటీ నేషనల్ ప్రచారానికి మీ వల్లనే గండి పడింది. మీరు సోషల్ మీడియాని వదిలేస్తే కొన్ని లక్షల మంది కూడా సోషల్ మీడియాని వదిలేస్తారు', అని ఒక వ్యక్తి చెప్పుకొచ్చాడు. మరోవైపు రాహుల్ గాంధీ 'వదిలేయాల్సింది సోషల్ మీడియా కాదు, ద్వేషాన్ని' అని మోడీ ట్వీట్ స్పందించారు. ఏదేమైనా '#NoSir' అనే హాష్ ట్యాగ్ 50 వేల ట్వీట్స్ తో ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: