తెలంగాణాలో క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందా అనే సందేహాలు వస్తున్నాయి.. కొందరి నేతల తీరు చూస్తుంటే.. ఇప్పటికే చాలమంది నాయకులు తమకు కాంగ్రెస్ పార్టీలో ఉంటే భవిష్యత్తు లేదనే ఆలోచనలతో గులాభి కండువాను కప్పుకోగా, ఇప్పుడొక ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఒకరు తన చూపులను కారువైపు మళ్లించాడనే ప్రచారం జోరుగా సాగుతుంది.. అతనే శ్రీధర్‌బాబు.. నిజానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో శ్రీధర్‌బాబు హవా ఓ రేంజ్‌లో ఉండేది. కానీ, ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. పార్టీ మారకుంటే రాజకీయమనుగడ ఉండదనే భావన చాలా మంది నాయకుల్లో ఉన్న ప్రశ్న.

 

 

ఇక మంథనిలో రాజకీయంగా శ్రీధర్ బాబుకు ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండడం... అధికారులంతా టీఆర్ఎస్‌ నేతలకే సలామ్ కోడుతుండడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఇప్పటికే టీఆర్ఎస్‌లో చేరడంతో శ్రీధర్‌బాబు, ఆలోచనల్లో సైతం మార్పు సంభవించడానికి కారణం అవుతున్నాయట.. ఈ దశలో శ్రీధర్‌బాబు పార్టీ మారతారనే ప్రచారం మళ్లీ తెరపైకి వస్తుంది.. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని 13 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 12 మంది ఎమ్మెల్యేలుంటే... ఒక్క మంథనిలో మాత్రం ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేగా శ్రీధర్‌బాబు ఉన్నారు. అయినా ఏడాది కాలంగా మౌనంగా రాజకీయలను కొనసాగిస్తున్నారు.

 

 

గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది టీఆర్ఎస్‌లో చేరిన సమయంలోనే శ్రీధర్‌బాబు కూడా పార్టీ మారతారనే ప్రచారం జరిగినా అవన్నీ ఒట్టి మాటలేనని కొట్టిపారేశారు. కాంగ్రెస్ వాదిగానే రాజకీయల్లో కొనసాగుతానంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా మరోపక్క, టీపీసీసీ చీఫ్‌ పదవి కోసం శ్రీధర్‌బాబు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతుండగా.. ఇలా పార్టీ మారతారనే వార్తలు కూడా రావడం వెనుక ఏదో మర్మం ఉండే ఉంటుందని అంటున్నారు కొందరు నాయకులు.. మరి తెలంగాణ రాజకీయాల్లో జరిగే మార్పులు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందేనని అనుకుంటున్నారట కొందరు..

మరింత సమాచారం తెలుసుకోండి: