నిన్నటి రోజున హైదరాబాద్ లో వ్యక్తికి కరోనా లక్షణాలతో కలిగి ఉండడంతో పరీక్ష చేయగా అతడికి పాజిటివ్ అని రావడంతో తెలుగు రాష్ట్రాలలో ఒక వంతు భయం మొదలైంది. అయితే కొన్ని రోజుల క్రితం తిరుపతి రుయా ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో చేరిన తైవాన్‌ దేశానికి చెందిన వ్యక్తికి వైరస్ ఉందని అనుమానంతో చెరిపించారు. అయితే ఇప్పుడు ఆ వ్యక్తికి వైరస్ సోక లేదని తేలింది. ఆ వ్యక్తికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీనితో తిరుపతి వాసులతో సహా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 

 


 తైవాన్ దేశ జాతీయుడైన చెన్ షి షన్ పలమనేరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో మెషిన్ రిపేర్ కోసం చిత్తూరు జిల్లాకు చేరారు. గత పదిరోజులుగా ఆయన ఇక్కడే నివాసం ఉంటున్నాడు. అప్పుడు ఆయనకి దగ్గు, గొంతు నొప్పి రావడంతో రుయా ఆసుపత్రిలోని ఐలేషన్ వార్డులో చేరాడు. సదరు వ్యక్తికి కరోనా సోకిందనే విషయం తెలియడంతో తిరుపతిలోని ప్రజలు భయాందోళనలకు బాగా లోనయ్యారు. నిజానికి ఆయనకు కరోనా వైరస్ సోకిందా లేదా అని తేల్చడం కోసం ఆయనని వైద్య పరీక్షల నిమిత్తం పరీక్షలు నిర్వహించారు. అతడి నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం వారు పంపారు. అయితే ఇప్పుడు నెగిటివ్ రిపోర్ట్ రావడంతో వారందరూ ఊపిరి పీల్చుకున్నారు.

 

 

అయితే ఇప్పడి వరకు ఆంధ్రప్రదేశ్‌ లో ఒక్క కరోనా వైరస్ (కోవిడ్- 19) కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్ రెడ్డి ఒక నివేదిక ఇచ్చారు. కోవిడ్‌ - 19 ను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై నిఘా ఉంచామని 24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. 

 

 

కోవిడ్ - 19 ప్రభావిత దేశాల నుంచి ఇప్పటి వరకు 263 మంది ప్రయాణికులు రాష్ట్రానికి చేరుకున్నారని, వారందరినీ ఇప్పుడు పరిశీలనలో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. వారంలో 50 మంది వారి ఇళ్లల్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 211 మందికి 28 రోజుల పరిశీలన ముగిసిందని అనుమానంగా ఉన్న 11 మంది శాంపిళ్లను ల్యాబ్‌ కు పంపించగా 10 మందికి నెగెటివ్‌ రిపోర్ట్ వచ్చిందని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: