ఏపీ సీఎం జగన్ ఇప్పుడు డైనమిక్ సీఎంగా పేరు తెచ్చుకుంటున్నారు. కానీ ఆయన ఈ స్థానం చేరుకోవడానికి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలిసిందే. దాదాపు 9 సంవత్సరాల పోరాటం తర్వాత ఆయన సీఎం పీఠం దక్కించుకున్నారు. ఆయన రాజకీయాల్లో రాణించడానికి తండ్రి వైఎస్సార్ పునాది వేసినా.. దానిపై తన స్వయంశక్తితో ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు.

 

 

అయితే ఆయన రాజకీయాల్లోకి రాక ముందు ఏం చేసేవారు.. అన్నది ఆసక్తికరమే. జగన్ రాజకీయాల్లోకి రాకముందు బిజినెస్ లు చూసుకునేవారు. అంత కంటే ముందు ఆయన బెంగళూరులోని లాంకో సంస్థలో ఉద్యోగం చేసేవారని తెలుస్తోంది. ఈ లాంకో సంస్థ ఎవరిదో తెలుసుకదా. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ది. ఆయన సంస్థలో ఉద్యోగం చేసి ఆ తర్వాత సొంత వ్యాపారాల్లోకి మళ్లారు జగన్.

 

 

ఇక జగన్ గురించి చెప్పాలంటే.. జగన్.. ఇప్పుడు ఏపీలో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుల్లో ఒకరు. ఇంతకీ జగన్ చదువుకున్నది ఏంటో తెలుసా.. జగన్ క్వాలిఫికేషన్ బీకాం. జగన్ హైదరాబాద్ బేగంపేట్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నారు. అక్కడ 12 వ తరగతి వరకు చదువుకున్నారు. తర్వాత నిజాం కాలేజీ లో బికాం చదివారు. ఆ తర్వాత ఎంబీఏ చేసేందుకు లండన్ వెళ్లినా అది పూర్తి కాకుండానే ఏపీకి వచ్చేశారు.

 

 

 

జగన్ గురించిన మరికొన్ని ఇంట్రస్టింగ్ విష।యాలు ఏంటంటే.. జగన్ తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందు కడప బాలకృష్ణ ఫాన్స్ అసోసియేషన్ కి జగన్ ప్రెసిడెంట్ గా ఉన్నారని చెబుతారు. సమరసింహా రెడ్డి, చెన్నకేశవ రెడ్డి లాంటి సినిమాల వల్లే జగన్ బాలకృష్ణ కి ఫ్యాన్ అయ్యారని అంటుంటారు. ఇక జగన్ ఫ్యామిలీ విషయానికి వస్తే.. జగన్‌ పెద్ద కూతురు వర్ష లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సీటు సంపాదించి సంచలనం సృష్టించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: