గత కొన్నినెలల నుండి సీఎం జగన్ చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. జగన్ కాపుల ఓట్లను చీల్చేందుకు, జనసేనను పరోక్షంగా దెబ్బ తీసేందుకు చిరంజీవిని రాజ్యసభకు పంపాలని ఆలోచిస్తున్నట్లు... చిరంజీవి అందుకు అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి చిరంజీవి మద్ధతు పలికారు. 
 
సైరా విడుదల తరువాత చిరంజీవి దంపతులు జగన్ ను కలిసి సైరా వీక్షించాలని కోరారు. వైసీపీ వర్గాలు చిరంజీవికి రాజ్యసభ సీటుపై ఇప్పటివరకూ స్పందించలేదు. కొద్ది రోజుల క్రితం మంత్రి బొత్స సత్యనారాయణను మీడియా ప్రతినిధులు చిరంజీవికి ఏపీ సీఎం జగన్‌ రాజ్యసభ సీట్‌ ఆఫర్‌ చేస్తారా? అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు మంత్రి సమాధానం ఇవ్వలేదు. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం జగన్ చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వడం లేదని తెలుస్తోంది. 
 
వైసీపీ ప్రభుత్వం శాసన మండలి రద్దు దిశగా అడుగులు వేయడంతో పార్టీలో ఎమ్మెల్సీ పదవులు ఆశించిన నేతలు రాజ్యసభ సీట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అమిత్ షా జగన్ ను ఒక రాజ్యసభ సీటును తాము సూచించిన అభ్యర్థికి కేటాయించాలని కోరారని ప్రచారం జరుగుతోంది. పార్టీలో రాజ్యసభ సీట్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. జగన్ చిరంజీవికి రాజ్యసభ సీటు కేటాయించడం అసాధ్యం అని తెలుస్తోంది. 
 
తాజాగా జగన్ చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ చేస్తారా...? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు పోసాని కృష్ణమురళి స్పష్టమైన సమాధానం ఇచ్చారు. జగన్ కు పవన్ ఓటు బ్యాంకును దెబ్బ తీయడానికి చిరంజీవిని దగ్గరకు తీసేంత చీప్ మెంటాలిటీ లేదని వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి రాజ్యసభ సీటు కోసం జగన్ దగ్గర వెంపర్లాడే మనిషి కాదని అన్నారు. వైసీపీకి సన్నిహితుడైన పోసాని చేసిన వ్యాఖ్యలతో జగన్ చిరంజీవికి రాజ్యసభ సీటు ఆఫర్ చేయడం లేదని స్పష్టత వచ్చినట్లే. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: