మొన్నటి ఎన్నికల్లో తాము  ఘోరంగా ఓడిపోయామన్న విషయాన్ని  తెలుగుదేశంపార్టీ నేతలు మరచిపోయినట్లున్నారు. ఇప్పటికీ అధికారంలో తామే ఉన్నామన్న భ్రమలో  అధికార వైసిపిని డిక్టేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు తాజాగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి మాటలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆయన మీడియాతో మాట్లాడుతూ తొందరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి సంబంధించి  ఎటువంటి అంశాలు ఉండాలో డిక్టేట్ చేస్తుందటమే  విచిత్రంగా ఉంది.

 

మూడు రాజధానుల ప్రస్తావనను గవర్నర్ ప్రసంగంలో ఉంచద్దంటూ ప్రభుత్వాని హెచ్చరించారు. ఇది ఒక విధంగా అధికారపార్టీని బ్లాక్ మెయిల్ చేయటం తప్ప మరోటి కాదు. గవర్నర్ ప్రసంగంలో ఏ ఏ అంశాలను ఉంచాలో నిర్ణయించాల్సింది అధికార పార్టీ అన్న విషయం యనమలకు తెలీదా ? మరి తెలిసి కూడా గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన వద్దని హెచ్చరించటమేంటి ? ఒకవేళ ప్రస్తావన ఉంటే శాసనమండలి ప్రసంగం ఆమోదం పొందటం కష్టమని కూడా ముందే చెబుతున్నారు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గవర్నర్ ప్రసంగంపై ఉభయసభలు ధన్యవాదాలు చెబుతాయే కానీ ప్రసంగం ఆమోదం పొందటమంటూ ఏమీ ఉండదు. గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా నిరసనే తెలుపుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. అధికారపార్టీ ఏమి రాసిస్తే గవర్నర్ అదే చదువుతారన్న విషయం యనమలకు తెలీదా ?  ప్రతిపక్షాలు గవర్నర్ ప్రసంగానికి సవరణలు ప్రతిపాదిచటం మామూలే. ఆ సవరణలను అధికారపార్టీ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.

 

అంతే కానీ యనమల చెప్పినట్లుగా గవర్నర్ ప్రసంగానికి  శాసనమండలి ఆమోదం తెలపటం అంటూ ఏమీ ఉండదు. ఇక్కడ సమస్య ఏమిటంటే శాసనసభ, మండలి నియమ, నిబంధనలు తనొక్కడికే తెలుసని, తాను మాత్రమే తెలివైన వాడినని యనమల భ్రమల్లో ఉన్నట్లున్నారు. కానీ తనకు మించిన తెలివి తేటలున్న వారు చాలామంది ఉంటారన్న విషయం యనమల మరచిపోయారు. అందుకనే నోటికొచ్చినట్లు మాట్లాడుతూ బ్లాక్ మెయిలింగ్ కు కూడా తెగబడుతున్నారు.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: