క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బిసిలకు చంద్రబాబునాయుడు ద్రోహం చేసినట్లు అర్ధమైపోతోంది. స్ధానిక సంస్ధల్లో బిసిలకున్న 59.85 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తన మనుషులతోనే హైకోర్టులో పిటీషన్ వేయించినట్లు తాజాగా బయటపడింది. స్ధానిక సంస్ధల్లో బిసిలకు 59.85 శాతం రిజర్వేషన్లు ఇవ్వటం చట్ట విరుద్దమంటూ రిజర్వేషన్లను  హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. దాంతో మొత్తం రిజర్వేషన్లలో బిసిల కోసం కేటాయించిన 34 శాతం రిజర్వేషన్లు ఇపుడు 25.15 శాతానికి తగ్గిపోయింది.

 

సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే బిసిలకు ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్ అంశాన్ని కోర్టు కొట్టేయటంపై వైసిపి-టిడిపి ఆరోపణలకు దిగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేసిన బిర్రు ప్రతాప్ రెడ్డి వైసిపి నేతే అంటూ టిడిపి నేతలు ఆరోపణలకు దిగారు. అయితే టిడిపి ఆరోపణలను కొట్టేసిన వైసిపి ప్రతాప్ రెడ్డి టిడిపి నేతే అంటూ కొన్ని సాక్ష్యాలను మీడియాకు రిలీజ్ చేసింది. విచిత్రమేమిటంటే ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి ఇటు చంద్రబాబునాయుడు అటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరితోను ఫొటోలు దిగున్నాడు. వాటినే రెండు పార్టీలు రిలీజ్ చేశాయి.

 

అయితే జగన్ మీడియా బయటపెట్టిన అంశాల ప్రకారం ప్రతాప్ రెడ్డి టిడిపి తరపున జడ్పిటిసిగా కూడా పనిచేశాడట. అదే సమయంలో  ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చాంబర్ కు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాడట. అంతేకాకుండా  ప్రతాప్ కు చంద్రబాబు ఏపిఎస్ఈజీసి కౌన్సిల్లో కూడా సభ్యునిగా నియమించాడు. అంటే ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశంపార్టీ నేతే అన్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది.

 

ఇక ఫొటోలంటారా అవకాశం వస్తే ఎవరు ఎవరితో అయినా ఫొటోలు దిగుతారు. కానీ నామినేటెడ్ పోస్టులివ్వటమంటే పార్టీకి సంబంధించిన వ్యక్తులయితేనే ఇస్తారు. ఎప్పుడైతే జగన్ మీడియా ఈ విషయాలను బయటపెట్టిందో అప్పటి నుండి టిడిపి మళ్ళీ ఈ విషయాన్ని వదిలిపెట్టేసి జగన్ బిసిలకు ద్రోహం చేస్తున్నాడని, సుప్రింకోర్టుకు వెళ్ళకపోతే బిసిలకు అన్యాయం చేసినట్లే అనే పనికిమాలిన వాదనను తెరపైకి తెచ్చింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: