తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ పై సొంత పార్టీ కార్యకర్తలు విమర్శలు చేస్తున్నారు. లోకేష్ తీరు నచ్చడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. లోకేష్ పద్ధతి మార్చుకోవాలని పార్టీ రాంగ్ రూట్లో వెళుతుందని సూచనలు చేస్తున్నారు. చంద్రబాబు 70 ఏళ్ల వయస్సులో పార్టీ కోసం ఎంతో శ్రమిస్తున్నారని లోకేష్ మాత్రం తప్పు మీద తప్పు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
యువనేతలకు లోకేష్ ఇచ్చిన విందు తెలుగు తమ్ముళ్ల ఆగ్రహానికి కారణమైంది. రెండు రోజుల క్రితం లోకేష్, బ్రాహ్మణి దంపతులు హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతల వారసులతో విందు సమావేశం నిర్వహించారు. టీడీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల వారసులు సమావేశంలో పాల్గొన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన ఈ సమావేశానికి చంద్రబాబు, భువనేశ్వరి కూడా హాజరయ్యారు. 
 
సోషల్ మీడియాలో విందు సమయంలో తీసుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన కొంతమంది తెలుగుతమ్ముళ్లు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. పార్టీ కార్యకర్తలతో కలిసి పోరాటాలు చేయాల్సిన సమయంలో విందులు ఏంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చంద్రబాబుకు లోకేష్ అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని తెలుగు తమ్ముళ్లు గుర్తు చేస్తున్నారు. 
 
లోకేష్ విందు ఇవ్వడంలో తప్పు లేదని... యువ నాయకులు అంటే గెలిచే సత్తా ఉన్న నాయకులు కావాలే తప్ప ఓడిపోయిన నాయకుల వారసులు కాదని తెలుగు తమ్ముళ్లు కామెంట్లు చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడేవారు కావాలని లేదంటే 2024లో టీడీపీ అధికారంలోకి రావడం ఒక కల అని ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీకి ప్రజా బలం ఉన్న నేతలు కావాలని ప్రజలు వద్దు అనుకున్న నాయకులు కాదని తెలుగు తమ్ముళ్లు విమర్శలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: