మీడియా వార్తలు రాస్తుంది.. రాజకీయ నేతలు రాజకీయం చేస్తారు.. ఇది సహజంగా జరిగే పనే.. కానీ ఏపీ విషయానికి వస్తే మాత్రం ఇందుకు కాస్త రివర్స్.. ఇక్కడ మీడియా కూడా రాజకీయం చేస్తుంది. వార్తలు ఇవ్వాల్సిన మీడియా.. వార్తల పేరుతో పెయిడ్ ఆర్టికల్స్ ఇస్తుంది. మనకు నచ్చిన పార్టీ అధికారంలో ఉంటే ఒకలాగా..నచ్చని వారు పీఠం ఎక్కితే ఇంకోలాగా వార్తలు రాసి తమకు నచ్చిన వారికి రాజకీయ లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నిస్తాయి.

 

 

ఏపీలోని ప్రముఖ మీడియా సంస్థలు చంద్రబాబు పార్టీ టీడీపీ అనుబంధ సంస్థల్లాగా పని చేస్తాయన్న సంగతి తెలిసిందే. అది వారి పాలసీగా మారిపోయింది. జగన్ ఎప్పుడు తప్పు చేస్తాడా .. చీల్చి చెండాడుదామా అని చూస్తుంటాయి. అది మంచిదే.. తప్పులను ఎత్తి చూపడం ప్రజలకూ మంచిదే. అదే సమయంలో జగన్ మంచి చేసినా సరే..దానిపై బురద జల్లుతాం అన్నట్టు ఉంటోంది చంద్రబాబు అనుకూల మీడియా తీరు.

 

 

అందుకు కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం.. జగన్ సర్కారు ఏపీలో మద్యపానాన్ని క్రమంగా తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందు కోసం మందు రేట్లు భారీగా పెంచింది. మద్యం దుకాణాలు పనిచేసే గంటలు తగ్గించింది. జరిమానాలు పెంచింది. ఇలా అనేక చర్యలు తీసుకుంది. కానీ ఇవేవీ చంద్రబాబు అనుకూల మీడియాకు పట్టవు. జగన్ మద్యం రేట్లు పెంచడం వల్ల పేదల జేబుల గుల్లవుతున్నాయని వార్తలు రాసేస్తాయి ఈ పసుపు కలాలు.

 

 

మరో విచిత్రం ఏంటంటే.. తెలుగులో ఓ అగ్రశ్రేణి పత్రికకు మద్యంపై పెద్ద స్థాయిలో పోరాడిన చరిత్ర ఉంది. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ హయాంలో మద్యపానంపై నిషేధం విధించారు. అందులో కీలక పాత్ర పోషించింది ఆ పత్రికే. అప్పట్లో అంతగా మద్యపాన నిషేధానికి పోరాడిన పత్రిక... ఇప్పుడు మాత్రం ఆ ఊసే ఎత్తదు. జగన్ సర్కారు ఆ దిశగా అడుగు వేస్తున్నా.. ప్రశంసించదు. ప్రసంశల సంగతి పక్కకు పెడితే.. ఈ విషయంలో కోడిగుడ్డుపై ఈకలు పీకేలా కథనాలు రాస్తుంటుంది. ఇదీ ఏపీలో పసుపు కలాల తీరు.. జోరు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: