చివరకు ఏమవుతుందో తెలీదు కానీ ఇప్పటికైతే అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్అంబానీని జగన్మోహన్ రెడ్డి ఫుల్లుగా టెన్షన్ పెట్టేస్తున్నట్లే ఉంది. తన సన్నిహితుడిని ఏపి నుండి రాజ్యసభ ఎంపిని చేసే విషయంలో ముఖేష్ ఫుల్లు టెన్షన్ తో ఉన్నాడు. మామూలుగా అయితే  ముఖేష్ అగటమే ఆలస్యం ఏ ముఖ్యమంత్రయినా ఓ రాజ్యసభ ఇచ్చే విషయంలో నో చెప్పడు. కానీ ఇక్కడున్నది జగన్ కదా అందుకనే విషయంలో అంబానీ టెన్షన్ పడుతున్నట్లు సమాచారం.

 

నాలుగు రోజుల క్రితం తన సన్నిహితుడు పరిమళ్ నత్వానీతో అమరావతికి వచ్చిన ముఖేష్ వైసిపిలో కోటాలో వచ్చే నాలుగు రాజ్యసభ ఎంపిల్లో ఒకదానిని నత్వానికి ఇవ్వాలని కోరారు. రిలయన్స్ అధనేత కోరికను జగన్ సానుకూలంగా స్పందించారంటూ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగిపోయింది.

 

అయితే అసలు జరిగిన విషయాన్ని నత్వానీయే పార్లమెంటులో మీడియాతో చెప్పారు. ఇంతకీ నత్వానీ చెప్పినదాని ప్రకారం ముఖేష్ కు జగన్ ఎటువంటి హామీ ఇవ్వలేదు. పైగా బయటవాళ్ళకు తమ పార్టీ తరపున అవకాశం ఇచ్చే సంప్రదాయం ఇంతవరకూ లేదని కూడా చెప్పేశాడట. సరే ఏదేమైనా తనకు మూడు రోజులు సమయం ఇవ్వాలని జగన్ అడిగినట్లు నత్వానీయే స్వయంగా చెప్పాడు. అంటే మూడు రోజుల్లో ఏమి తేలుతుంది ? ముఖేష్ కోరికను జగన్ మన్నిస్తాడా ? లేకపోతే రాజ్యసభ ఇవ్వటం  సాధ్యం కాదని తిరస్కరిస్తాడా ?

 

ఇపుడీ విషయమే రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖేష్ అంతటి వ్యక్తి వచ్చి స్వయంగా అడిగ్గానే జగన్ ఒప్పేసుకునుంటాడని అందరూ అనుకున్నారు. ఇందుకనే జగన్-ముఖేష్ భేటిపై టిడిపి నేతలు నోటొకొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అంటే చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితునిగా ముద్రపడిన ముఖేష్ వచ్చి జగన్ తో భేటి అవటాన్ని టిడిపి నేతలతో పాటు పచ్చమీడియా తట్టుకోలేకపోతోంది. దానికి తోడు ముఖేష్ అడిగినట్లు ఓ రాజ్యసభ సీటును జగన్ ఇచ్చేస్తున్నారనే ప్రచారంతో టిడిపి, పచ్చమీడియా మంటెక్కిపోతోంది. ఇటువంటి దశలోనే స్వయంగా నత్వానీయే మూడు రోజులు సమయం అడిగారని చెప్పటాన్ని ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: