ఈ మద్య కొంత మంది ప్రభుత్వ అధికారులు చేస్తున్న పనులకు నవ్వాల్లో ఏడ్వాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంటుంది.  ఎందుకంటే వీరు చేస్తున్న ఘనకార్యాలు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతున్నాయి.  ముఖ్యంగా హాల్ టికెట్స్ పై సినీ తారుల, క్రీడాకారులు, రాజకీయ నేతల బొమ్మలు రావడం.. ఓటరు కార్డులో ఏకంగా కుక్క బొమ్మలు రావడం ఒక్కటి కాదు రెండు కాదు ప్రభుత్వ ఆఫీసర్ల నిర్లక్ష్యం ఎన్నోసార్లు బయట పడుతూనే ఉంది.  అయితే ఎప్పటికప్పుడు దిగువ స్థాయి అధికారుల పేర్లు చెబుతూ... తప్పించుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ఠ. రెండేళ్ల క్రితం మృతి చెందిన ఉపాధ్యాయుడిని ఉన్నతాధికారులు తాజాగా సస్పెండ్ చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.   అయితే ఇది తెలిసి చేసినా.. తెలియక చేసినా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శల పాలు అవుతున్నారు.

 

ఈ సంఘటన బిహార్ లో జరిగింది.  రెగ్యూలరైజేషన్ చేయాలంటూ.. గత నెల 17న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పరీక్ష పేపర్లు దిద్దేందుకు వెళ్లిన రెగ్యులర్ ఉపాధ్యాయులను అడ్డుకున్నారు. వారిపై దాడి కూడా చేసినట్టు వార్తలొచ్చాయి. దాడి నేపథ్యంలో ఉపాధ్యాయులు విధులకు గైర్హాజరయ్యారు. అయితే ఉపాధ్యాయులు గైర్హాజరు కావడాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు విధులకు హాజరుకాని ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించి గత నెల 28న ఆదేశాలు జారీ చేశారు. అప్పటికే ఈ విషయం పై అక్కడ చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉన్నాయి.  తాజాగా ఇప్పుడు ఈ విషయం లో కొత్త కోణం బయట పడటంతో హవ్వా అంటూ అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. 

 

విధులకు హాజరుకాని ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించి దానిలో పెద్ద తప్పిదం జరిగింది.   వారు సస్పెండ్ చేసిన ఉపాధ్యాయుల్లో రెండేళ్ల క్రితం మరణించిన రంజిత్ కుమార్ యాదవ్ అనే టీచర్ పేరు కూడా ఉండడం విమర్శలకు కారణమైంది. బెగుసరైలోని కేంద్రంలో పేపర్లను దిద్దాల్సిన ఆయన విధులకు గైర్హాజరయ్యారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతే చచ్చినోళ్లను కూడా సస్పెండ్ చేస్తారా అంటూ వ్యంగాంగా ప్రశ్నిస్తున్నారు.  రెండేళ్ల క్రితం మృతి చెందిన వ్యక్తి పేపర్లు దిద్దేందుకు ఎలా వస్తారంటూ అధికారుల నిర్లక్ష్యంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: