రైలు ప్రయాణం సురక్షితం, అన్ని సదుపాయాలు ఉంటాయని చాలా మంది రైలు మాగ్రాల ద్వారా ఆమె గమ్యాలను చేరుకోవాలని అనుకుంటారు. అందుకోసం రైల్వే అధికారులు కూడా ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మరీని సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే ఎన్ని ఉండి ఏం లాభం అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లు ఎంత కఠినమైన కట్టుదిద్దు బాట్లు ఏర్పాటుచేసిన కూడా నేరాలు జరుగుతూనే ఉన్నాయి. 

 


వివరాల్లోకి వెళితే.. ఎక్కడా స్త్రీలకూ రక్షణ లేకుండా పోయిందన్న విషయాలు రోజు చూస్తూనే ఉన్నాము. అమ్మాయిలను, మహిళలను వేధించడానికి కామాంధులకు వీలుకాని చోటంటూ ఏదీ లేకుండా పోయింది. మెట్రోలు, రైళ్లలో కూడా మహిళలపై లైంగిక వేధింపులు జరిగాయన్న వార్తలు తరచూ చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే 2017-19 మధ్య భారతీయ రైళ్లలో మగువలపై జరిగిన అఘాయిత్యాలపై ఆర్టీఐ ఓ నివేదికను సేకరించింది.. 

 


ఆ రిపోర్టులో భయంకర నిజాలు వెలుగు చూశాయి. కదిలే రైళ్లలో మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయని.. అంతేకాకుండా వాటికి సంబంధించిన కేసులు కూడా అధికశాతంలోనే నమోదయ్యాయని ఆర్టీఐ వెల్లడించింది.ఈ విష్యం పై ఆరా తీయగా కదులుతున్న రైళ్లలో మహిళలపై 160 కి పైగా కేసులు నమోదు అయ్యాయని రేల్వే పోలీసులు వెల్లడిస్తున్నారు. 

 


లైంగిక వేధింపుల కేసులు అయితే ఏకంగా 1672 నమోదయ్యాయని రైల్వే శాఖ సమాచారం. వీటిలో 870 కేసులు కదులుతున్న రైళ్లలో చోటు చేసుకున్నవట. కాగా, దొంగతనాల సంఖ్య విషయానికి వస్తే సుమారు 4718 కేసులు నమోదైనట్లు భారతీయ రైల్వే అధికారులు తెలిపారు. అటు గడిచిన మూడేళ్లలో 771 కిడ్నాపింగ్ కేసులు, 4,718 దొంగతనాలు, 213 అటెంప్ట్ మర్డర్, 542 మర్డర్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. రైల్లో ప్రయాణించే మహిళలు తస్మాత్ జాగ్రత్త సుమీ.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: