ప్రపంచంలో కరోనా ఎన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  కరోనా వలన ఇప్పటికే 70కి పైగా దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి.  ముందు జాగ్రత్తగా అన్ని దేశాలు ప్రజలను హెచ్చరిస్తున్నాయి.  తాజాగా కరోనా హైదరాబాద్ లోకి ప్రవేశించింది.  దీంతో ప్రజలు ప్రమత్తం అయ్యారు. అధికారులు ప్రజలకు మార్గదర్శకాలు సూచిస్తున్నారు.  కరోనా వలన వచ్చిన ఇబ్బందులు పెద్దగా ఉండవని, కరొనతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనా వైరస్ సోకితే మరణిస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదని మంత్రులు హెచ్చరిస్తున్నారు.  


ఇక ఇదిలా ఉంటె, కరోనాపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న సవాల్.  ఇందుకోసం నగరంలో ప్రధాన కూడళ్లలో పెద్ద పెద్ద హోర్డింగ్ లు ఏర్పాటు చేసి కరోనాపై అవగాహనా కల్గించేలా చర్యలు తీసుకోబోతున్నారు.  ప్రజలు ఎలా ఉంటె కరోనా సోకకుండా ఉంటుందో అలా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  


ఇక జలుబు, స్వరం, దగ్గు వంటివి ఉంటె వెంటనే హాస్పిటల్ కు రావాలని, దానికి తగిన ట్రీట్మెంట్ ప్రభుత్వం అందిస్తుందని అంటున్నారు.  ప్రజలు ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చెయ్యొద్దని అంటున్నారు.  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దాని ఫలితం తీవ్రంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు.  నిత్యం అందుబాటులో ఉండేందుకు ఓ టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది.  


ఎక్కడికక్కడ చర్యలు తీసుకొని అందరిని అప్రమత్తంగా ఉంచేందుకు ప్రభుత్వం సదా సిద్ధంగా ఉండటం విశేషం.  ఇక ఇదిలా ఉంటె ప్రతి గంటకు ఒకసారి శుభ్రంగా చేతులు కాళ్ళు క్లీన్ చేసుకుంటూ ఉండాలి.  దాని వలన వైరస్ బారిన పడకుండా ఉండేందుకు కొంతవరకు సులభం అవుతుంది. ఇక షేక్ హ్యాండ్ ఇవ్వడం కంటే కూడా విష్ చేయడం మంచిది అని అంటున్నారు. మరి ప్రభుత్వం జారీ చేస్తున్న మార్గదర్శకాలను ప్రజలు ఎంతవరకు పాటిస్తారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: