పెళ్లి చేయాలంటే ఎంత హడావిడి ఉంటుంది. ఇరు కుటుంబాలు ఒప్పుకోవాలి.. తర్వాత అన్ని లాంచనాలు మాట్లాడుకోవాలి... ఎంతో షాపింగ్ చేయాలి... ఆ తర్వాత బంధుమిత్రులను పిలిచి అందరి సమక్షంలో ఎంతో సందడి వాతావరణంలో పెళ్లి చేసుకోవాలి. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం ఎక్కువగా ఇలాంటి పెళ్లిళ్లు కంటే రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఏదో ఇలా వెళ్లామా  అలా పెళ్లి చేసుకున్నామా  అన్నట్లుగానే ఉంటున్నారు నేటితరం జనాలు. దీంతో ఆ నాటి పెళ్లి సందడి ఎక్కడా కనిపించడం లేదు. 

 

 ఒకప్పుడు జరిగే ఐదు రోజుల పెళ్లి లో మొత్తంగా కనుమరుగయ్యాయి అనే చెప్పాలి. ఒకప్పుడు ఒకరింటికి ఒకరు వెళ్లి అబ్బాయి అమ్మాయి చూసుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం అలా లేదు స్మార్ట్ఫోన్ తీసి మ్యాట్రిమోనీ సైట్ ఓపెన్ చేసి అందులో నచ్చినవారిని సెలెక్ట్ చేసుకోవడం. ఇదిలా ఉంటే తాజాగా ఇక్కడ ఒక దేశ ప్రభుత్వం ఓ విచిత్ర చట్టాన్ని తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది. అదేమిటంటే... ఇక నుంచి యువతీ యువకులు పెళ్లి చేసుకోవాలంటే పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు... స్త్రీ పురుషులు ఒకసారి శారీరకంగా కలిస్తే చాలు పెళ్లి జరిగినట్లే అని నిర్ధారించడానికి ఓ సరికొత్త చట్టాన్ని తీసుకురావాలని ఇక్కడి ప్రభుత్వం నిశ్చయించింది. 

 


 ఇంతకీ ఇది ఎక్కడ అనుకుంటున్నారా.. రష్యాలో . రష్యా ప్రభుత్వం తమ రాజ్యాంగంలో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైంది. స్త్రీ పురుషుల మధ్య జరిగే సంగమాన్ని కూడా పెళ్లి గా గుర్తించే విధంగా... రష్యా  రాజ్యాంగంలో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఏకంగా ఆడ మగ ఇద్దరు శారీరకంగా కలిస్తే చాలు అది పెళ్లి గా పేర్కొనే  విధంగా సరికొత్త చట్టాన్ని తీసుకు రానున్నది రష్యా ప్రభుత్వం. మ్యారేజ్ హెటిరోసెక్స్వల్   యూనియన్ గా గుర్తించడంతో పాటు... ఆ రిలేషన్ లో ఉన్నవారు మాత్రమే పిల్లలను దత్తత తీసుకునే వీలు కల్పిస్తోంది. మరోవైపు స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేసే ప్రసక్తే లేదు అంటూ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: