తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత... అటు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి తెలంగాణలో టిడిపి పరిస్థితి రోజు రోజుకు మరింత అధ్వానంగా తయారైన విషయం తెలిసిందే. అసలు రాష్ట్రంలో పార్టీ ఉందా లేదా అనే ప్రశ్న తలెత్తే విధంగా పార్టీల పరిస్థితి తయారైంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సత్తా కొనసాగించిన విషయం తెలిసిందే. అటు టిడిపి పార్టీ కూడా ఏకంగా ఇరవై మూడు సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సత్తా చాటుతూ అధికారంలో కొనసాగింది. కానీ ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైతే.. తెలంగాణ రాష్ట్రంలో టిడిపి పార్టీ కనుమరుగయింది. 

 


 అయితే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏకంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ని వదిలేసి పార్టీ ఆఫీస్ ను వదిలేసి ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎక్కువ దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చాక అసలు తెలంగాణ టిడిపి ని పట్టించుకోవడమే మానేశారు. అయినప్పటికీ తెలంగాణ లోని కొంతమంది నేతలు మాత్రం ఇంకా పార్టీలోనే కొనసాగితూ  పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తెలంగాణలో పవర్ ఫుల్ లీడర్ అయిన రేవంత్ రెడ్డి పార్టీ పరిస్థితిని ముందుగానే ఊహించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఇక ప్రస్తుతం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

 


 పార్టీ కనీసం ఎన్నికల్లో పోటీ చేయాలేని  పరిస్థితి ఉన్నప్పటికీ ఎల్.రమణ మాత్రం ఇంకా టిడిపి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఏ పార్టీ వైపు కూడా వెళ్లలేదు. ఇక చంద్రబాబు ఎలాంటి సపోర్టు లేనప్పటికీ.. తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఎలాంటి వ్యూహాలను అమలు చేయడానికి ముందుకు రానప్పటికీ కూడా ఎల్.రమణ మాత్రం ఇంకా టిడిపి పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే తాజాగా టిడిపి పార్టీ పరిస్థితి తెలిసి కూడా అధినేత చంద్రబాబు తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ పై పలు ఆరోపణలు చేయడాన్ని ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు తప్పుబడుతున్నారు. వేరే కోపాన్ని  తీసుకొచ్చి ఎల్.రమణ పై  చంద్రబాబు చూపిస్తున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: