రాజకీయాల్లో ప్రధానమైన అంశాలు తెర మీద కనిపించే అంశాలతోపాటు అండర్ లాబీయింగ్  కూడా ఎంతో ముఖ్యమైన విషయం తెలిసిందే. ప్రధానమైన అంశాలను తెరమీద కనబడుతూ అందరికీ తెలుస్తూ ఉంటాయి కానీ అండర్ లాబీయింగ్  మాత్రం ఎవరికి కనిపించవు. ఓవైపు తెర మీద కొన్ని ప్రధాన అంశాలను పెడుతూనే కొన్ని వ్యూహాత్మక అంశాలను అండర్ లాబీయింగ్ ద్వారా నిర్వహిస్తూ ఉంటారు నేతలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్  సహా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లు.. ఈ అండర్ లాబీయింగ్ చేస్తున్నట్లు గా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇలా రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. 

 

 కానీ ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం ఈ  విషయం పై చర్చిస్తే కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనిపై సానుకూలంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహా ప్రధానమంత్రి నరేంద్రమోడీ లను  కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన గురించి చర్చిస్తున్నారు అన్నది రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట.తెరమీదకి  రాష్ట్ర ప్రయోజనాల కోసం బేటీ అవుతున్నామని చెబుతున్నప్పటికీ.. అండర్ లాబీయింగ్  వ్యూహాలు మాత్రం వేరే ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

 

 అయితే ఇప్పటికే కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కాశ్మీర్ తో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు కూడా నియోజకవర్గాల పునర్ విభజన చేస్తే.. కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలిపే అవకాశం ఉంది అని.. అందుకే ఏకకాలంలో మూడు రాష్ట్రాలకు సంబంధించి నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలి అంటూ కేంద్ర ప్రభుత్వానికి కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇలా జరగడం వల్ల అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు ముఖ్యమంత్రులకు పలు రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని.. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: