గత రెండు రోజులుగా కిచెన్ లోనే మూత్రం పోసి ఆ మూత్రాన్ని టీ, కూర, అన్నం గిన్నెలలో కలిపి వంట చేస్తున్న ఒక పనిమనిషికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు నెట్టింట పెద్ద దుమారం రేపాయి. అయితే సీసీ కెమెరాలో కనిపించిన ఆ పనిమనిషి ఒక ముస్లిం మహిళ అని... ఆ ఇల్లు హిందువులదని సోషల్ మీడియాలో యదేచ్ఛగా ప్రచారం జరిగింది. అలాగే ఈ వైరల్ అవుతున్న వీడియో ని వందల మంది నెటిజనులు షేర్ చేసుకుంటూ ముస్లిం మహిళ దారుణమైన నిర్వాకం చూడండి అంటూ తిట్టి పోశారు. 

 

 

ఒక ఫేసుబుక్ యూసర్ ఈ వీడియోని పోస్ట్ చేస్తూ 'హసీనా అనే పేరు గల ఈ పనిమనిషి ఒకసారి దొంగతనం చేస్తూ పట్టుబడింది. దీంతో ఆ ఇంటి యజమాని అయిన సూరి ఆమెని తిట్టి తన ఇంట్లో సీసీ కెమెరా సెట్ అప్ చేయించాడు. ఐతే ఒకరోజు సూరి సీసీ కెమెరాలు పరిశీలిస్తుండగా హసీనా తను చేస్తున్న వంటల్లో మూత్రం పోస్తూ అడ్డంగా బుక్కయింది', అని పేర్కొన్నాడు.

 


ఇకపోతే ఈ వెగటు పుట్టించే సంఘటన భోపాల్ లోని ముకేశ్ సూరి ఇంట్లో చోటు చేసుకుంది. అయితే వైరల్ అయిన ఈ వీడియో క్లిప్ గురించి సోషల్ మీడియాలో చెప్పిన కథలు మొత్తం అబద్ధాలే. నిజాలేంటంటే... ఈ వీడియో క్లిప్ 2011వ సంవత్సరంలో వెలుగులోకి వచ్చింది. అలాగే ఈ వీడియో లో కనిపిస్తున్న పనిమనిషి ముస్లిం కాదట ఆమె అసలు పేరు పేరు ఆశా కౌశల్ అట. 

 


సీసీ కెమెరా దృశ్యాలని చూసిన తక్షణమే పనిమనిషి అసహ్యమైన చర్యపై పోలీసులకి ముఖేష్ సూరి కంప్లైంట్ ఇవ్వగా... కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారించారు. వారి విచారణలో ఆశా కౌశల్ కూతురిపై ఇంటి యజమాని కన్నేశాడని... అది తట్టుకోలేక ఆమె ఆ యజమాని కుటుంబానికి మూత్రం కలిపిన వంటలని వడ్డించిందని తేలింది. అయితే ఆ పనిమనిషి పేరు ఆశా కౌశల్ అని, ఆమె ముస్లిం మహిళ కాదని ఈ సంఘటన గురించి తొలుత ఓ వార్తని ప్రచురించిన ఒక ప్రముఖ వెబ్సైటు కూడా తెలియపరిచింది. సో, మూత్రం పోస్తూ దొరికిపోయిన ఆ పనిమనిషిని ముస్లిం కాదని స్పష్టమౌతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: