ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లు ఎంత విధ్వంసానికి దారి తీసిందో అందరికీ తెలిసిందే.  దేశాన్ని ఒక్కసారే ఉలిక్కి పడేలా చేసిన ఈ ఘటనల్లో ఇప్పటికీ 47మంది చనిపోయారు.  దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న అల్లర్లలో మహమ్మద్ షారూఖ్ అనే ఓ యువకుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. జాఫ్రాబాద్-మౌజ్‌పూర్ ప్రాంతంలో ఓ పోలీస్ కానిస్టేబుల్‌కు రివాల్వర్ గురిపెట్టిన షారూఖ్ ఫోటో సంచలనం రేకెత్తించింది. ఆ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు రిలీజ్ అయ్యాయి. అత‌ను ఆ రోజున 8 రౌండ్ల బుల్లెట్లు ఫైర్ చేశాడు. పోలీసుల‌పై తుపాకీతో కాల్పులు జ‌రిపిన ఘ‌ట‌న త‌ర్వాత‌.. షారూక్ ప‌రారీలో ఉన్నాడు. క్రైం బ్రాంచ్‌కు చెందిన సుమారు ప‌ది ద‌ళాలు అత‌ని కోసం గాలించాయి. 

 

మృతుల్లో పోలీస్ కానిస్టేబుల్ రతన్ లాల్, ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ అంకిత్ శర్మ ఉన్నారు. రెండు మృతదేహాలు గోకుల్‌పురిలోని డ్రైనేజీలో లభ్యమవగా.. మరో మృతదేహం శివ్ విహార్‌లోని డ్రైనేజీలో లభ్యమైంది. ఈ అల్లర్లలో దాదాపు రెండు వందల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.  గాయపడ్డ వారిని ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.  అయితే ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లు  రాజకీయ నాయకులు ఎవరికి వారే తమ ఇష్టం ఉన్న రీతిలో కామెంట్స్ చేస్తున్న విషయంతెలిసిందే.  కాగా, నిన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ అంకిత్ శర్మ కుటుంబానికి కోటి రూపాయల ఆర్తిక సహాయం ప్రకటించారు.

 

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రెండు సిట్ బృందాలు దీనిపై విచారణ జరుపుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 254 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయగా.. ఇందులో 41 కేసులు ఆయుధ చట్టం కింద నమోదు చేయబడినవి.  అల్లర్లతో సంబంధం ఉన్నట్టుగా అనుమానిస్తున్న 903 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అంతే కాదు  సామాజిక మాధ్యమాల్లో పుకార్లు వ్యాపింప జేస్తున్న 40 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: