బిసిల రిజర్వేషన్ అంశంపై చంద్రబాబునాయుడును వైసిపి రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి వాయించేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా విజయసాయి వరుసబెట్టి చంద్రబాబుకు ఉతికి ఆరేస్తున్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బిసిలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం  34 రిజర్వేషన్ కల్పించిన విషయం తెలిసిందే. అంటే మొత్తం రిజర్వేషన్ల శాతం 59.5 దాటిపోయింది. అయితే మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే నిబంధనుంది.

 

ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని టిడిపి నేత బిర్రు ప్రతాప్ రెడ్డి హై కోర్టుకు వెళ్ళి ప్రభుత్వ నిర్ణయాన్ని వీగిపోయేట్లు చేశాడు. దాంతో ప్రభుత్వం కల్పించిన 54 శాతం రిజర్వేషన్లు చెల్లవంటూ కోర్టు తీర్పిచ్చింది. దాంతో వైసిపి-టిడిపి నేతల మధ్య రిజర్వేషన్ల మంటలు మొదలైపోయాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒకవైపు ప్రభుత్వం అమలు చేయాల్సిన రిజర్వేషన్లను కోర్టు ద్వారా నిలిపేయించి అదే సమయంలో బిసిలకు రిజర్వేషన్ల అమలుపై జగన్ కు చిత్తశుద్ది లేదని చంద్రబాబు చెప్పటంపై విజయసాయి వాయించేస్తున్నారు.

’అంగిట బెల్లం ఆత్మలో విషం’ అంటూ చంద్రబాబును దెప్పి పొడిచారు. బిసిలపై ఎక్కడలేని ప్రేమ చూపిస్తునే ఆచరణలో మాత్రం వాళ్ళని అణగదొక్కేస్తున్నట్లు మండిపడ్డారు. బిసిలను హైకోర్టు జడ్జిలుగా, ఉన్నతాధికారులుగా పనికిరారంటూ చెప్పిన చంద్రబాబు నైజం  గురించి బిసిలందరికీ తెలుసన్నారు. తన వర్గం తప్ప బిసిలనెవరినీ అధికారం పీఠం దరిదాపులకు కూడా రాకుండా చంద్రబాబు అణగదొక్కేశాడంటూ మండిపడ్డారు.

 

బిసిలను చంద్రబాబు ఓటుబ్యాంకుగా తప్ప మరోరకంగా ఎప్పుడూ చూడలేదని చెప్పారు. అంటే చంద్రబాబు హయాంలో బిసిలను ఏ విధంగా తొక్కిపడేసిందీ విజయసాయి వివరాలతో సహా ఇచ్చారు లేండి. బిసి, ఎస్సీ, ఎస్టీలకు 59.85 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న జగన్ ఆశయాన్ని చంద్రబాబు హై కోర్టులో కేసు వేయించి అడ్డుకున్నట్లు వైసిపి ఎంపి ఉతికి ఆరేశాడు. మొత్తానికి ఒకవైపు చంద్రబాబును ఇంకోవైపు చినబాబు లోకేష్ ను విజయసాయి ట్విట్టర్ వేదికగా దుమ్ము దులిపేస్తున్నదైతే వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: