నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ కు చెందిన 27 ఏళ్ల యువతిని అదే గ్రామానికి చెందిన ఒక ప్రముఖ పార్టీ నేత అపహరించి ఆరు రోజులపాటు ఆమెపై అత్యాచారం చేశాడు. నిందితుడైన ఆ పార్టీ నేత వయసు పై బడిన వాడు కావడం గమనార్హం. ఇంకా అతను బాధిత కుటుంబం యొక్క సామాజిక వర్గానికి చెందిన వాడే కావడంతో యువతి కుటుంబానికి సులువుగా దగ్గరయ్యాడు.




అలా దగ్గరైన ఆ రాజకీయ పార్టీ నేత 27 ఏళ్ల యువతిపై కన్నేశాడు. తరువాత ఒకరోజు ఆమెను లోబరుచుకున్నాడు. అలా లోబర్చుకున్న ఆమెను ఒకరోజు అపహరించి తనతోనే 6 రోజులు పాటు ఉంచుకుని ఆమెపై పలు సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఐతే తమ కూతురు అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 19వ తారీఖున పోలీసుల ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో ఒక రాజకీయ నాయకుడి పై తమకు అనుమానం ఉందని పేర్కొన్నారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు మాత్రం నమోదు చేయలేదు.




ఐతే రెండు రోజులు గడిచిన తర్వాత అదృశ్యమైన యువతి ఇంటికి తిరిగి వచ్చేసింది. ఏమైందమ్మా? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లావు? అని ఆమెని ఆరా తీయగా... తన పై జరిగిన అఘాయిత్యం గురించి చెప్పి బోరుమని ఏడ్చింది. దీంతో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ రాజకీయ నేత పై ఫిర్యాదు చేశారు. క్రమక్రమంగా ఈ విషయం కాస్త మండలం మొత్తం తెలిసింది. ఈ క్రమంలోనే ఆమె గర్భం కూడా ధరించింది. దీంతో తన పరువు ఎక్కడ పోతుందో అని సదరు రాజకీయ నాయకుడు పోలీస్ స్టేషన్ కి వచ్చి బాధిత కుటుంబ సభ్యులను పిలిపించి ఆ ఘన కార్యాన్ని తను చేయలేదని చెప్పుకొచ్చాడు.




కానీ మోసపోయిన ఆ యువతి సదరు నాయకుడిని గట్టిగా నిలదీయడంతో... తాను తన తప్పుని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత కొంతమంది పెద్దలు పంచాయతీ పెట్టి బాధిత కుటుంబ సభ్యులు ఆరు లక్షల రూపాయలను తీసుకునేలా ఒప్పందం కుదిర్చారు. ఆ తర్వాత సదరు రాజకీయ నేత ఆరు లక్షలు తెచ్చి ఇవ్వగానే పెద్దలు ఆ డబ్బుని కుటుంబ సభ్యులకి ఇచ్చేసి వారిని ఇంటికి పంపించేశారు. ఈ దారుణం అంతా పోలీస్ స్టేషన్ లో జరుగుతున్నా పోలీసులు మాత్రం మౌన ప్రేక్షకపాత్ర వహించారు.










మరింత సమాచారం తెలుసుకోండి: