ప్రస్తుతం కరోనా  వైరస్ ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. చైనా దేశంలో మరణ మృదంగం వాయిస్తూ ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది ఈ ప్రాణాంతకమైన వైరస్. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి మూడు వేల మంది వరకు చనిపోగా 80 వేల మందికి ఈ వైరస్ బారినపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక ప్రపంచ దేశాలలో కూడా ఈ వైరస్ భయంతో గజగజ వణికిపోతున్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ ఈ  ప్రాణాంతకమైన కరోనా  వైరస్ తమ దేశంలోకి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఎన్నో ముందస్తు చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇప్పటికే ప్రపంచంలోని 57 దేశాల్లోకి  ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి చెందింది. అటు ఉత్తర కొరియా లో కూడా ఈ ప్రాణాంతకమైన వైరస్ విజృంభిస్తుంది. 

 

 

 అయితే ఇప్పటికే భారత్లోని కేరళ రాష్ట్రంలో ఈ మహమ్మారి కరోనా వైరస్ కు సంబంధించి మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో భారత ప్రజలు  కూడా ప్రాణభయంతో వణికిస్తున్న విషయం తెలిసిందే.ఇక తాజాగా  తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో కూడా కరోనా కేసు నమోదు కావడం ప్రజలను మరింత ఆందోళన చెందేలా చేస్తుంది. అయితే తెలంగాణలో కరోనా కేసు నమోదైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు సిద్ధమయింది. 

 

 

 కరోనా వ్యాప్తిని అరికట్టడం పై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కరోనా  వైరస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా చర్యలను  తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కరోనా  వ్యాధిని నివారించేందుకు ముందుగానే సన్నద్ధం కావాలి అంటూ అధికారులకు ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే విధంగా అధికారులు వైద్యులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని తెలిపారు. ముందు  జాగ్రత్త చర్యగా అన్ని జిల్లాల్లో ఆసుపత్రిలో ఐసొలేషన్  వార్డులను  ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా కరోనా పై  తప్పుడు ప్రచారాలు నమ్మకుండా రాష్ట్ర ప్రజలందరికీ అధికారులు అవగాహన కల్పించాలని ఆదేశించారు. వీలైనన్ని మాస్కూలు కూడా అందుబాటులోకి తేవాలని సూచించారు. గ్రామ సచివాలయంలో కూడా కరోనా  పై సూచనలు జాగ్రత్తలతో కూడిన కరపత్రాలను ఉంచాలని  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తిపై రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: