తనదైన వ్యాఖ్యలతో అందరినీ ఆకట్టుకునే సినీనటి, వైసీపీ ఫైర్ బ్రాండ్ లేడీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా సెల్వమణి తెలుగుదేశం పార్టీపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం బొండా ఉమ పెట్టిన ప్రెస్ మీట్‌లో.. సంపూర్ణ మద్య నిషేధంపై జగన్‌ మడమ తిప్పారని విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా..  కల్తీ మద్యానికి ఏపీని బ్రాండ్‌గా మార్చేశారని వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎవరూ చూడని బ్రాండ్లను ఏపీలో అమ్ముతున్నారని త‌ప్పుబ‌ట్టారు. ఎమ్మెల్యేలే కల్తీ మద్యం తయారు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. కల్తీ లిక్కర్ తాగిన కార్మికులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారన్నారు.

 

మ‌రియు పింఛన్లే కాదు మద్యం కూడా డోర్ డెలివరీ చేస్తున్నారని బోండా ఉమ తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. దీనిపై న‌గ‌రి ఎమ్మెల్యే రోజా స్పందించారు.  టీడీపీ నేతలు కల్లు తాగిన కోతుల్లా వ్యవహరిస్తున్నారని, అధికారం పోయాక పిచ్చెక్కిందంటూ ఆమె మండిపడ్డారు. మద్యపాన నిషేధం దిశగా వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నారని రోజా తెలిపారు. జగన్ సీఎం అయిన ఒక నెలలోనే 43వేల‌ బెల్ట్ షాపులు తీసేసిన ఘనత సాధించారని, సీఎంకు మహిళలంతా జేజేలు ప‌లుకుతున్నార‌ని చెప్పుకొచ్చాఉ. అయితే బొండా ఉమ పెట్టిన ప్రెస్ మీట్‌లో.. మందు బ్రాండ్స్ అన్నీ ఎదురుగా పెట్టుకుని బార్ సేల్స్ మ్యాన్‌లా మాట్లాడారని ఎద్దేవా చేశారు. 

 

మ‌రియు మందు బాటిళ్లు టీడీపీ ఆఫీసులో ప్రదర్శించారంటే అది టీడీపీ ఆఫీసా లేక బార్ షాపా అని ప్రశ్నించారు. చంద్ర‌బాబు  హయాంలో మద్యం ఎరులై పారిందని.. ఈ విషయాన్ని మహిళలెవరూ మర్చిపోలేదని రోజా ఆరోపించారు. అక్క‌డితో ఆగ‌ని రోజా.. మద్యం బాటిళ్లను ప్రదర్శించిన టీడీపీ నేతలపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇక  ప్రతిపక్ష నాయకుడు తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడిలా కనిపిస్తున్నారని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అలాగే ముఖ్యమంత్రి సంతకం అంటే ఐఎస్ఐ ముద్రలా ఉండాలని కానీ.. చంద్రబాబు బెల్ట్ షాపులు నిర్మూలిస్తానని సంతకం చేసి మర్చిపోయారని రోజా ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: