పార్టీ విషయంలోనే కాకుండా ప్రజలకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఉంటారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం తెలంగాణలోనూ కనిపిస్తుండడంతో కేటీఆర్ అప్రమత్తమయ్యారు. తాజాగా దుబాయ్ నుంచి తెలంగాణకు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఓ వార్డుని కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన కట్టుదిట్టమైన ఏర్పాట్లు కెటిఆర్ పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.

IHG


 ఈ సందర్భంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేటీఆర్ చర్చించారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారి సహాయార్థం ప్రత్యేక హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయవలసిందిగా మంత్రులకు, అధికారులకు ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు. అలాగే 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండేలా కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ భేటీలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటెల రాజేందర్, ఆరోగ్య శాఖ అధికారులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

IHG


ఈ సందర్భంగా కరోనా వైరస్ విషయం గురించి కేటీఆర్ మాట్లాడారు. కరోనా వైరస్ వస్తే చనిపోతారని ప్రజలంతా ఆందోళన చెందుతున్నారని, ఎవరూ ఎటువంటి అపోహలు నమ్మవద్దని, ఆయన సూచించారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున హోర్డింగ్స్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రస్తుతం తెలంగాణాలో కరోనా భయంతో ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఇప్పటికే కరోనా బారిన పది చైనాలో వందలమంది ప్రాణాలు విడిచారని ప్రచారం ఒకవైపు .. ఆ వైరస్ ఇప్పుడు నగరంలోనూ వ్యాప్తి చెడుతుందన్న వార్తలతో ప్రజలంతా భయం భయంగా  కనిపిస్తున్నారు. ఈ భయాన్ని పోగొట్టేందుకు ఇప్పుడు కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: