జగన్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని విధాల మంచి పాజిటివ్ వేవ్ ఏర్పడే ఉంది. సంక్షేమ పథకాల విషయంలో అలాగే పరిపాలన విషయంలో ఎక్కడా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా జగన్ అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటూ పరిపాలన చేస్తున్నారు. ముఖ్యంగా పాదయాత్రలో అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే లక్ష్యంగా పరిపాలిస్తున్నారు. దాదాపు సంవత్సరం గడవకముందే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల లో చాలా వరకు ఇప్పటికే అమలులోకి తీసుకువచ్చింది జగన్ సర్కారు. ఇటువంటి తరుణంలో దేశంలోనే మంచి ముఖ్యమంత్రిగా ప్రజల చేత శభాష్ అనిపించుకున్న నేతగా దేశవ్యాప్తంగా బెస్ట్ సీఎం గా మూడో స్థానాన్ని ఇటీవల వైఎస్ జగన్ దక్కించుకోవడం జరిగింది.

 

ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో మరియు జాతీయ స్థాయిలో కూడా మంచి పేరు ఉన్న జగన్ ఒక్క విషయంలో మా తలపట్టుకుంటున్నారట. అదేమిటంటే ఇటీవల హైకోర్టు మార్చి చివరికల్లా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని లేకపోతే 14వ ఆర్థిక సంఘం నుండి రావాల్సిన నిధులను ఆఫ్ చేయడానికి అవకాశం ఉందని గట్టిగా ఆదేశాలు పంపింది. అయితే ఈ సమయంలో బీసీలకు 55 శాతానికి మించి గతంలో జగన్ ప్రభుత్వం ఎన్నికలలో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది.

 

దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 55 శాతానికి మించి జగన్ సర్కార్ రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ ఇటీవల ఒకరు హైకోర్టులో పిటిషన్ వేయడంతో...హైకోర్టు ఆదేశాల మేరకు  వెంటనే జగన్ సర్కార్ కల్పించిన 59 శాతం రిజర్వేషన్లను తగ్గించడం జరిగింది. దీంతో ప్రస్తుతం బీసీలలో జగన్ సర్కార్ పై సరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కొద్దిగా వ్యతిరేకత ఏర్పడింది. సరిగ్గా ఎన్నికల టైం ముందు ఇలా జరగడంతో ఈ విషయాన్ని అతి పెద్ద తలనొప్పిగా జగన్ భావిస్తారట. అనవసరంగా ముందు 59 శాతం రిజర్వేషన్లు అని చెప్పి మాట ఇచ్చి కోర్టు చేత మొట్టికాయ వెయించు కోవాల్సి వచ్చింది అని బాధ పడుతున్నారని సమాచారం. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: