ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ గురించి తెగ ఆందోళన చెందుతున్నారు. చైనాలో వ్యూహాన్ నగరంలో బయట పడిన ఈ వైరస్ దాదాపు కొన్ని వేల మంది ఈ వైరస్ వల్ల మరణించడం జరిగింది. మనిషి నుండి మనిషికి సోకే ఈ వైరస్ వల్ల చాలామంది బలైపోతున్నారు. దీంతో చైనా ప్రభుత్వం ఆ దేశంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి రాకపోకలను ఆపేయటం జరిగింది. అంతేకాకుండా ప్రతి ప్రాంతం బోర్డర్ దగ్గర కరోనా వైరస్ చెకింగ్ వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి మిలటరీ వారిని సెక్యూరిటీ గా నియమించారు. తాజాగా ఈ కరోనా వైరస్ అమెరికాలో మరియు జపాన్, మలేషియా వంటి దేశాలలో కూడా ఈ వైరస్ ఉన్నట్లు అక్కడ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటువంటి తరుణంలో మొన్నటి వరకు భారత దేశంలో ఎక్కడా కూడా ఈ వైరస్ దేశం లోకి రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నా తాజాగా ఢిల్లీలో మరియు హైదరాబాద్ నగరంలో ఈ వైరస్ బయటపడింది.

 

ఇటువంటి తరుణంలో సెలబ్రిటీలు అయ్యుండి కరోనా వైరస్ గురించి చార్మి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు చేత బండ బూతులు తీట్టించుకుంది. విషయంలోకి వెళితే ఇటీవల తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో ఒక పాజిటివ్ కేసు నమోదు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఇటువంటి కీలక సమయంలో హీరోయిన్ ఛార్మి ``వెల్కమ్ టూ కరోనా`` అంటూ ఓ సిల్లీ కామెంట్ సోషల్ మీడియాలో పెట్టింది.

 

దీంతో ఆ కామెంట్ వైరల్ గా వివాదాస్పదంగా మారింది. హైదరాబాద్ ప్రజలు కరోనా భయంతో వణికి పోతుంటే నీకు ఆనందంగా ఉందా..? తోలు ఊడిపోద్ది, పైశాచిక ఆనందం పొందుతున్నవా..? అంటూ దారుణంగా దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో టార్చర్ భరించలేక చార్మి దిగొచ్చి అందరికీ క్షమాపణలు చెప్పింది. అంతకు ముందే ఆ కామెంట్ ని.. వీడియోని డిలీట్ చేసింది. కాగా ఆ ఐడియా ఇచ్చింది పూరి జగన్నాథ్ అనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: