మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసిపి సాధించిన విజయం ఎంత సంచలనమైందో అందరికి తెలిసిందే. సాధించిన విజయం ఒక సంచలనమైతే బిసిల అండ దొరకటం మరింత సంచలనంగా మారింది. తెలుగుదేశంపార్టీ పెట్టినప్పటినుండి పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న బిసిలు మొదటిసారి దూరంగా జరిగారు. దూరంగా జరిగారని అంటే గంపగుత్తగా కాదు. బిసిల్లో స్పష్టమైన చీలిక వచ్చింది. మెజారిటియో లేకపోతే మైనారిటియే మొత్తానికి బిసిలు  కూడా వైసిపికి మద్దతుగా నిలబడేసరికి జగన్ కు అఖండమైన మెజారిటి వచ్చిందన్నది వాస్తవం.

 

మూడు దశాబ్దాలకు పైగా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న బిసిలు వైసిపికి మద్దతుగా నిలబడేటప్పటికి చంద్రబాబునాయుడుతో పాటు పార్టీ నేతల్లో ముఖ్యంగా బిసి నేతలకు మండిపోయింది. అప్పటికేదో బిసిల మీద టిడిపికి మాత్రమే పేటెంట్ హక్కులున్నట్లుగా అప్పటి వరకూ ఫీలయిపోయేవారు లేండి. అదుగో బిసిల మీద  అప్పుడు మొదలైన మంట తాజాగా కోర్టులో కేసు వేసి వాళ్ళ రిజర్వేషన్లను తగ్గించేదాకా పెరిగిపోయింది.

 

స్ధానిక సంస్ధల ఎన్నికల్లో రిజర్వేషన్లను ప్రభుత్వం 59.85 శాతానికి పెంచింది. ఇందులో బిసిలకే 34 శాతం వాటా దక్కింది. దీంతో చంద్రబాబు అండ్ కో జగన్ కు వ్యతిరేకంగా కుట్రలు పన్నిబిర్రు ప్రతాపరెడ్డి అనే నేతతో కోర్టులో కేసు వేయించింది. దాంతో ప్రభుత్వం కేటాయించిన రిజర్వేషన్ వీగిపోయింది. దాంతో బిసిల కోటా తగ్గిపోయేసరికి  పదవుల్లో కూడా బిసిల వాటా బాగా తగ్గిపోయింది.

 

అంటే కోర్టులో కేసు వేయటం ద్వారా చంద్రబాబు ఏమి సాధించదలచుకున్నారో అర్ధం కావటం లేదు.   ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేశారంటే అర్ధం బిసిలకు వ్యతిరేకంగా వేశారనే. కేసు వేసింది టిడిపినే అని తేలిపోయిన తర్వాత చంద్రబాబు అండ్ కో జగన్ పై ఎదురుదాడి చేస్తుండటమే విచిత్రం. చంద్రబాబు కుట్రలు దూరమైన బిసిలను మరింత దూరం చేసుకోవటమే తప్ప ఇంకేమీ కాదన్న ఇంగితం కూడా వాళ్ళలో లేకపోయింది. మరి దీని ప్రభావం రాబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఎలా పడుతుందో చూడాల్సిందే.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: