హైదరాబాద్ లో ఉద్యోగం.. నెలకు రూ. 40వేల జీతం.. ఈ రెండు మాటలు వింటే చాలు.. ఆహా వాడు మహారాజు అంటారు పల్లెటూళ్లో మన సంగతి తెలిసిన వాళ్లు.. కానీ.. నెలకు 40వేలు వస్తున్న వాడి జీవితం ఎలా ఉంటుందో తెలుసా.. అదేంటో.. వాడి బాధేంటో వాడి మాటల్లోనే విందాం..

 

కష్టపడి జాబ్ చేసి.. సంవత్సరం చివర నీకు మిగిలింది ఏంది.. బజాజ్ ఈ ఎం ఐ లు తప్ప..నెలకు జీతం 40 వేలు అనుకో... ఇంటి అద్దె, పాలు, కరెంట్ బిల్, రైస్, కూరగాయలు, ఆయిల్, చికెన్, పెట్రోల్, పిల్లల ఫీజు.. యల్ కేజీ కూడా 20వేలు కాబట్టి ఒక్కడికి.. నాకు ఇద్దరు పిల్లలు కాబట్టి నెలకు 4000 వేలు.. పిల్లలకి ప్రతి నెల హాస్పిటల్స్ కి 2000 అవుతాయి.ఆరోగ్య శ్రీ లేదుగా ఇన్సూరెన్స్ కట్టాలి...నెలకు 4లుగురికి 4000 వేలు.... ఇప్పటికే 30 వేలు అయింది.. నెలకు మినిమం ఖర్చు.. ఇక పండగలు పెళ్లిళ్లు బర్త్ డే లు అమ్మ వాళ్ళ ఊరు...అత్తగారి ఊరు ప్రయాణాలు...ఖర్చులు...

 

 

ఇవన్నీ కాక....40వేల జీతం కదా అని పెళ్ళాం వచ్చి మంచి ఫోన్ కొను.. ఏసీ కొను...ఫ్రిడ్జ్ కొను ...వాషింగ్ మెషీన్ కొను ... సోఫా కొను... గోల్డ్ కొను... బొక్క కొను... భోషాణం కొను అంటే ఉంటాయా... ఏమన్నా అంటే 40వేలు జీతం ఏం చేస్తావ్ అంటారు. సరే...ఏదో అడుగుతుందిగా అని బాంక్ కి వెళితే ....టాక్స్ రిటర్న్స్ కట్టిన కాగితాలు తీసుకు రా అంటాడు... ఏం మిగిలింది అని టాక్స్ కట్టడానికి...40వేలు అయిపోయి ...పక్కన ఫ్రెండ్ ని అడుగుదాం అంటే వాడి పరిస్థితీ అంతే....

 

 

సరే అడిగింది కదా అని బజాజ్ లో EMI లో కొంటె మళ్లా నెలనెలా వాడి గోల..కాస్త జీతం లేటైతే..ఎవర్ని అడిగినా...ఇదేమాట... నేను కట్టాలి బ్రో అని... ఎలాగోలా టాక్స్ కడుతూ నెట్టుకొస్తుంటే ఒక రోజు ఫంక్షన్ కి చుట్టాలు వచ్చి...అయ్యా 40 వేలు జీతం కదా ...స్థలం కొన్నవా....ఇల్లు కట్టవా అని...ఏంది రా ఈగోల...40వేల జీతం తో స్థలం కొనలేం...ఇల్లు కట్టలేం... ప్రభుత్వం స్థలం ఇవ్వదు.... నేను కొనలేను.. ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వదు.... నేను కట్టలేను... 40వేలు జీతం తీసుకుని నేను పీకింది ఏంది..

మరింత సమాచారం తెలుసుకోండి: