జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కడప స్టీలు ఫ్యాక్టీరీ రూపంలో మొదటి విజయం సాధించబోతున్నారు. కడప స్టీలు ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కొరియాకు చెందిన హ్యూందాయ్ స్టీల్స్ చాలా ఆసక్తిగా ఉంది. పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ (పిపిపి) పద్దతిలో ఏర్పాటు చేయాలని అనుకుంటున్న ఈ కంపెనీలో సుమారు రూ. 15 వేల కోట్లు పెట్టుబడి పెట్టటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. గడచిన రెండు నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ సమస్య లేకపోతే ఈ పాటికే అవగాహనా ఒప్పందాలు కూడా అయిపోయేవట.

 

కడపలో స్టీలో ఫ్యాక్టరీ ఏర్పాటన్నది రాష్ట్ర విభజన చట్టంలో ఓ హామీ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే 2014లొ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి విభజన హామీలను తుంగలో తొక్కుతున్న నరేంద్రమోడి ప్రభుత్వం ఈ కంపెనీ విషయంలో కూడా ఇదే పద్దతిలో వెళుతోంది. దానికి తోడు అధికారంలో ఉన్నపుడు చంద్రబాబునాయుడు ఆడిన డ్రామాల వల్ల కూడా కంపెనీ ఏర్పాటు పేరుతో చాలా రాజకీయ డ్రామాలే నడిచాయి. అప్పట్లో టిడిపి రాజ్యసభ ఎంపి సిఎం రమేష్ నిరాహార దీక్ష పేరుతో చేసిన డ్రామాలేవీ జనాలను మెప్పించలేకపోయింది.

 

సరే తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కేంద్రం నుండి రావాల్సిన సాయంపై పెద్దగా నమ్మకం పెట్టుకోలేదు. అందుకనే పిపిపి పద్దతిలో రాష్ట్రప్రభుత్వమే కంపెనీ ఏర్పాటు చేస్తే సరిపోతుందని చర్యలు మొదటుపెట్టారు. అయితే అనూహ్యంగా హ్యూందాయ్ కంపెనీ సీన్ లోకి వచ్చింది. ఐరన్ ఓర్ ముడిసరుకును ఇండోనేషియా, ఆస్ట్రేలియా లాంటి దేశాల నుండి తెప్పించుకోనున్నట్లు కూడా హ్యూందాయ్ చెప్పిందట.

 

కడప స్టీలు ప్లాంట్ లో ఉత్పత్తయిన స్టీలును   కృష్ణపట్నం నుండి  ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు.  అలాగే రాయలసీమ థర్మల్ ప్లాంట్ నుండి విద్యుత్, గండికోట రిజర్వాయర్ నుండి నీటి సరఫరాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హ్యూందాయ్ ప్రతిపాదనల ప్రకారం ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 20 వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలుంటాయి. ఇందులో సుమారు 14 వేలమంది స్ధానికులే ఉంటారు. పరిస్ధితులన్నీ అనుకూలిస్తే ఈ నెలలలోనే అవగాహనా ఒప్పందం కుదిరితే పనులు కూడా మొదలుపెట్టేస్తారేమో ?

మరింత సమాచారం తెలుసుకోండి: