పుత్రరత్నం నారా లోకేష్ విషయంలో చంద్రబాబునాయుడు ధైర్యం చేయాలని తెలంగాణా నేతలంతా కోరుకుంటున్నారట. ఇంతకీ చంద్రబాబు చేయాల్సిన ధైర్యం ఏమిటనగా  లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలట. ప్రస్తుతం తెలంగాణా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి  ఎల్ రమణ పనితీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారుట లేండి. అంటే తెలంగాణాలో పార్టీ ఎక్కడుంది ? దీని కార్యకలాపాలేంది అని ఎవ్వరూ అడక్కూడదు.

 

నిజానికి తెలంగాణాలో తెలుగుదేశంపార్టీ ఉందని చెప్పుకోవటానికి తప్ప ఇంకదేనికీ పనికిరాదు. పార్టీలోని చెప్పుకోతగ్గ నేతల్లో రమణ పేరు తప్ప రెండోపేరే ఎవరికీ గుర్తుకురాదు. ఏదో కిందా మీదా పడి పార్టీని  రమణే నెట్టుకొస్తున్నాడు. ఇలాంటి రమణ అధ్యక్షుడిగా ఉన్నందుకు సంతోషించాల్సిన చంద్రబాబు ఆయనపై మండిపడ్డాడట. ఎందుకంటే పార్టీలో సమన్వయ కమిటిలు వేయలేదట. జిహెచ్ఎంసి ఎన్నికలకు పార్టీని రెడీ చేయటం లేదట.

 

చంద్రబాబు మాటలు వినటానికి ఎంత విచిత్రంగా ఉన్నాయో కదా ? తెలంగాణాలో అసలు పార్టీ ఉనికే లేదంటే మళ్ళీ దానికో సమన్వయకమిటినట. జీహెచ్ఎంసి ఎన్నికల్లో పోటియట.  అందుకనే పార్టీలో మిగిలిన కొద్దిమంది నేతలు కలిసి చంద్రబాబుకు ఓ సూచన చేశారట. రేపో మాపో శాసనమండలి రద్దయితే లోకేష్ చేసేదేమీ లేదు కాబట్టి తెలంగాణా పార్టీ పగ్గాలను సుపుత్రుడికి అప్పగించమని చెప్పారట.

 

అప్పుడు కానీ ఇపుడు రమణ పడుతున్న బాధలు చంద్రబాబుకు అర్ధంకావు. ఎందుకంటే పార్టీ ఉంటే బలోపేతానికి కష్టపడటం వేరు. లేనిపార్టీ కోసం కష్టపడటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. చంద్రబాబు బాగా  యాక్టివ్ గా ఉన్న ఏపిలోనే నేతలు పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవటం లేదు. అలాంటిది ఆసుపత్రి ఐసియులో రోగుల్లాగ తెలంగాణాలో పార్టీ పరిస్ధితి చాలా కాలంగా ఐసియులోనే ఉంది. ఇలాంటి పార్టీకి అధ్యక్షుడిగా ఎవరుంటే ఏమిటి ?  కాబట్టి తెలంగాణా పార్టీ గురించి వదిలిపెట్టి ఏపిలో పరిస్ధితేంటో చూసుకుంటే మంచిది.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: