తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ గారి రాష్ట్రమంతటా ఉన్నాగాని దాన్ని తట్టుకొని గెలవడం జరిగింది. గత సార్వత్రిక ఎన్నికలలో కూడా విజయవాడ పార్లమెంటు స్థానం నుండి కేశినేని నాని గెలిచారు. వరుసగా రెండుసార్లు గెలవడంతో రాష్ట్రంలో పాటు జాతీయ స్థాయిలో కూడా కేశినేని నానికి మంచి ఇమేజ్ ఏర్పడింది. పైగా వ్యాపారాలు చేయడంతో పాటుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కీలక వ్యవహారాలను అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేశినేని నాని జాతీయ స్థాయిలో చక్రం తిప్పడం జరిగింది. ప్రస్తుతం కూడా జాతీయస్థాయిలో కేశినేని నానికి మంచి ఇమేజ్ ఉంది.

 

అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబును సైతం ప్రశ్నించ కలిగిన నాయకుడు కేశినేని నాని. 2019 ఎన్నికల్లో అసలు పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు గురించి మీడియా సమావేశం పెట్టి కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇటువంటి తరుణంలో తాజాగా బీజేపీ కన్ను కేశినేని నాని పై పడింది. ఏదైనా విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పడంతో పాటు జాతీయస్థాయిలో కొద్దిగా పట్టు ఉండటంతో కేశినేని నాని ని బిజెపి పార్టీలోకి తీసుకు వచ్చి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి బీజేపీ పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ఇక పూర్తిగా బీజేపీలో ఉంటేనే అనే కండిషన్ తెలంగాణ బీజేపీ నాయకుడి ద్వారా కేశినేని నాని ముందు బీజేపీ పార్టీ పెద్దలు పెట్టారట. ప్రస్తుతం టిడిపి పార్టీ పరిస్థితి దారుణంగా ఉండటంతో పాటుగా చంద్రబాబుపై అనేక కేసులు నమోదు కావడంతో పాటు ఆయన వయసు కూడా మీద పడటంతో పార్టీని ముందుకు నడిపించే పరిస్థితి కాని నేపథ్యంలో కేశినేని కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి ఆలోచిస్తున్నట్లు సమాచారం. నిజంగా కేశినేని నాని కూడా బీజేపీ పార్టీ లోకి వెళ్లి పోతే ఇంకా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గల్లంతైనటే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: