స్నేహానికున్న విలువను రోజు రోజుకు తగ్గిస్తున్నారు కొందరు నికృష్టపు మనుషులు.. నమ్మిన చోటే ఆ నమ్మకం అనే ముసుగులో దారుణాలకు ఎగబడుతున్నారు.. ముఖ్యంగా అమ్మాయిల విషయాల్లో మరీ దారుణంగా వంచన చేస్తున్నారు.. రోజు రోజుకు లోకంలో జరిగే అత్యాచారాలు వెలుగులోకి వస్తున్న అమ్మాయిల ఆలోచనల్లో మార్పు రావడం లేదు.. గొర్రెలు కసాయివాడిని నమ్మినట్లుగా మగ స్నేహితుల వెంట తిరుగుతు హత్యాచారాలకు గురవుతున్నారు..

 

 

ఒక వైపు మీడియా జోరుగా ప్రచారం చేస్తున్న, పోలీసులు హెచ్చరిస్తున్న ఇంకా లోకంలో ఇలాంటి హత్యాచారాలు జరుగుతున్నాయంటే లోపం ఎక్కడుందో ఒక్క సారి ఆలోచించండి.. కాలేజీ చదివే అమ్మాయిలు మీ తల్లిదండ్రులు మీపై ఎంతో నమ్మకంతో పై చదువులకు మిమ్మల్ని పంపిస్తే.. ఆ నమ్మకాన్ని ఎంత వరకు నిలపెడుతున్నారో మీ మనస్సును అడగండి..

 

 

ఎవడో స్నేహితుడి వెంట వెళ్లడం ఎందుకు.. వాడు నమ్మించి రేప్ చేసాడని పరువు తీసుకోవడం ఎందుకు.. బజారుకు ఎక్కడం ఎందుకు.. క్షుణంగా ఆలోచిస్తే, ఒక అమ్మాయి అధికమైన చనువు ఇస్తేనే కదా అబ్బాయి అంత నీచానికి ఒడిగట్టేది.. భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవలసిన వయస్సులో శృంగార పాఠాలు నేర్చుకుంటూ చెట్లపొదల్లో, సినిమా హల్లో, సెల్‌ఫోన్ చాటింగ్‌ల్లో  సమయాన్ని వృధా చేస్తూ కన్నవారు పెంచుకున్న నమ్మకాన్ని శీలం రూపంలో పోగొట్టుకుంటున్నారు.. ఇకపోతే ఇలాంటి ఘటనే గుంటూరు నగరంలో జరిగింది..

 

 

అగ్రికల్చరల్‌ బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ యువతి ఉన్నత చదువుకోసం గుంటూరు నగరంలో గతంలో కోచింగ్‌ తీసుకుంది. ఆ సమయంలో జేకేసీ కళాశాల ప్రాంతానికి చెందిన యువకుడితో ఏర్పడిన పరిచయం ఆ అమ్మాయి జీవితానికి శాపంగా మారింది.. ప్రేమిస్తున్నానని వేధించిన యువకుని ప్రేమను నిరాకరించిన ఆమెపై మనసులోనే కామాన్ని పెంచుకుని, మంచివాడిగా నమ్మించి అదునుకోసం కాపుకాస్తున్న అతనికి ఆ సమయం చిక్కగానే తన కౄరత్వాన్ని ప్రదర్శించాడు.. ఈ క్రమంలో ఆ విద్యార్థినికి వేరే జిల్లాలో అగ్రికల్చర్‌ బీఎస్సీలో సీటు వచ్చింది. అక్కడి కళాశాలకు సెలవులు ఇవ్వడంతో రైలులో తన స్వగ్రామానికి బయల్దేరిన ఆ యువతి విషయాన్ని తెలుసుకున్న ఆ యువకుడు నమ్మించి గుంటూర్‌లో రైలు దిగేలా చేసాడు..

 

 

అప్పటికే అక్కడ మాటు వేసిన ఆ కామాంధుడు ఆమెను బయటకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఎన్నో నక్కజిత్తుల ఉపాయాలు వేసాడు.. చివరికి అతని ఆలోచన ఫలించి ఆ అమ్మాయి అతనితో వెళ్లిన పాపానికి అమరావతి రోడ్డులో ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం లాఫారం వద్ద వదిలి వెళ్లిపోగా స్నేహితులకు ఫోన్‌లో సమాచారం అందించి వారి సాయంతో ఇంటికి చేరింది. ఇక జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఆ యువతీ తల్లిదండ్రులు స్థానిక పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ మొదలుపెట్టారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: