ప్రస్తుతం కరోనా వైరస్ అందరిని బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. చైనా దేశంలో విజృంబిస్తు  ఇప్పటికే మూడు వేల మందిని పొట్టన పెట్టుకుని... 80వేల మందిని మృత్యువుతో పోరాడేలా చేస్తున్న ఈ ప్రాణాంతకమైన వైరస్ భారత్ లో  కూడా ప్రవేశించిన విషయం తెలిసిందే. భారత్లోనే కేరళ రాష్ట్రంలో మొదటి మూడు కరోనా  కేసులు గుర్తించబడ్డాయి. ఇక భారత్ లోకి కూడా ఈ ప్రాణాంతకమైన వైరస్ రావడంతో భారత ప్రజలందరూ బెంబేలెత్తిపోయారు, ఇదిలా ఉంటే ఈ ప్రాణాంతక వైరస్  తెలుగు రాష్ట్రాల్లోని  తెలంగాణకు కూడా చేరుకున్న విషయం తెలిసిందే. బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన  హైదరాబాద్ వాసికి కొరోనా  ఉన్నట్లు నిర్ధారణ అయింది. 

 


 దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ ప్రాణభయంతో వణికిపోతున్నారు.అయితే దీనిపై అటు  తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక్కసారిగా అలెర్ట్  అయిపోయింది. అయితే కరోనా  బాధితుడు  80 మంది ప్రత్యక్షంగా కాంటాక్ట్ అయినట్లు గుర్తించామని.., అందులో 45 మంది గాంధీ ఆస్పత్రికి తరలించాము  అంటూ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా కరోనా  పై వచ్చే అవాస్తవమైన వార్తలను నమ్మకూడదు అంటూ  ప్రజలకు సూచిస్తున్నారూ.  అంతేకాకుండా ప్రజలకు అవగాహన కల్పించే విధంగా పలు సూచనలు కూడా ఇస్తున్నారు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. 

 


 అయితే ఈ వ్యాధి గాలి ద్వారా సోకే అవకాశం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు ఈటెల రాజేందర్. కేవలం వ్యాధిగ్రస్తుడు తుప్పర్లు  మీద పడినప్పుడు మాత్రమే ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని తెలిపారు. అంతేకాకుండా వ్యాధిగ్రస్తుడు తో చేయి చేయి కలిపి  ముక్కులో నోట్లో పెట్టుకున్నప్పుడు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని తెలిపారు. అయితే ఈ వ్యాధి రాకుండా చేయడానికి ఒకే ఒక అవకాశం ఉందని ఈటెల రాజేందర్ తెలిపారు. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలని... ఇలా  అయితే ఈ వ్యాధిని 99% అరికట్ట గలిగే అవకాశం ఉంది అంటూ తెలిపారు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్. అంతేకాకుండా బయటకు వెళ్లినపుడు మాస్క్  ధరించాలి అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: