ప్రపంచం మొత్తాన్ని కలవర పెడుతున్న ఒకే ఒక్క పదం కరోనా..! చైనాలో పుట్టి...అన్ని దేశాలకు విస్తరిస్తున్న కోవిడ్ 19 వైరస్.. ఇప్పుడు ఉగ్రరూపం దాల్చింది. చైనా వెలుపల కూడా మరణాలు క్రమంగా పెరుగుతున్నాయి. అమెరికాలో కరోనాతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్‌లో కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.  కరోనా హద్దులు లేకుండా అన్ని దేశాలకు విస్తరిస్తోందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

 

ఇటీవల కాలంలో ప్రపంచదేశాలు ఈ తరహా హెల్త్ ఎమర్జెన్సీని ఎప్పుడూ చూసి ఉండవు. చైనా నుంచి అమెరికా వరకు ఏ దేశం గురించి మాట్లాడుకున్నాఅన్ని దేశాల్లోనూ ఒకటే ఆందోళన.. అదే కరోనా... ఈ మహమ్మారి ఎప్పుడు  కంట్రోల్ అవుతుందా... దీనికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ప్రపంచ జనాభా ఎదురుచూస్తోంది.  చైనాలో కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని... ఇతర దేశాల్లో కూడా పెద్దగా ప్రభావం ఉండదనుకుంటున్న సమయంలో కోవిడ్ 19 వైరస్ మరోసారి జూలు విధిలించింది. ఇతర దేశాలకు వేగంగా విస్తరించడం మొదలు పెట్టింది. దక్షిణకొరియా,ఇటలీ,ఇరాన్‌,జపాన్, అమెరికాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

 

24 గంటల వ్యవధిలో చైనా వెలుపల నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య 8 రెట్లు ఎక్కువగా ఉందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
కరోనా వైరస్ హద్దులు లేకుండా విస్తరిస్తోందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య పెరగడంపై WHO ఆందోళన చెందుతోంది. కరోనా గురించి టెన్షన్ పడొద్దని అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన కొన్ని గంటలకే ఆ దేశంలో కరోనా కేసులు పెరిగిపోయాయి. అమెరికాలో 91 కేసులు నమోదుకాగా... వారిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా వాషింగ్టన్‌ రాష్ట్రానికి చెందినవారే. వారం రోజుల వ్యవధిలో పది లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించే విధంగా అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాట్లు చేసింది. 
మరోవైపు జలుబు దగ్గుతో బాధపడుతున్న పోప్‌ ఫ్రాన్సిస్‌కు కూడా కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఆయనకు నెగిటివ్ వచ్చింది...స్పాట్ 

 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య లక్షకు చేరువుగా ఉంది. చైనా సహా వివిధ దేశాల్లో మరణించిన వారి సంఖ్య 3100 దాటింది.  ఇటలీలో 52 మంది, ఇరాన్‌లో 66 మంది కరోనాతో చనిపోయారు. దక్షిణ కొరియాలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.  కొత్తగా 243  కేసులు నమోదయ్యాయి. చైనా వెలుపల మొత్తం 9 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు కోవిడ్ 19కు ఈ ఏడాది చివరిలోగా వాక్సిన్ అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: