అభివృద్ధి చెందిన చైనాను వణికిస్తోంది. అగ్రరాజ్యం సహా అన్ని దేశాలను హడలెత్తిస్తోంది. చాలా దేశాలు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి, ఆంక్షలు విధించాయి. చైనా అయితే ఏకంగా పదిరోజుల్లోనే భారీ ఆస్పత్రుల నిర్మాణం చేసి.. వైరస్‌పై యుద్ధాన్ని ప్రకటించింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కరోనా మనదేశంలోనూ అడుగు పెట్టింది. ఈ రాకాసిని  ఎదుర్కోవడంలో మన సన్నద్ధత ఎంత..? చాలా ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేని పరిస్థితుల్లో.. ఈ రాకాసి విజృంభిస్తే అడ్డుకోగలమా..? ప్రభుత్వాలకు, వైద్యాధికారులకే దీనిపై అవగాహన లేని దుస్థితి. ఇలాంటప్పుడు సామాన్యుడి బతుక్కి  గ్యారెంటీ ఏది ? 

 

కరోనా రక్కసి కోరలు చాస్తోంది. ఒక్కో కంట్రీలో పాగా వేస్తూ... ప్రజల జీవితాలను బలితీసుకుంటోంది. అగ్రరాజ్యాలు సైతం .. వైరస్ పేరు చెబితే వణికిపోతున్నాయి. మరి ఇలాంటి కీలకసమయంలో .. ఈ రాకాసి వైరస్ మనదేశంలోనూ ఎంటరైంది. ఈ రాక్షసిని మనం అడ్డుకోగలమా అనేది ఇపుడు పెద్ద ప్రశ్న.

 

మనదేశంలో ఆస్పత్రులు నిర్లక్ష్యానికి నిలువుటద్దాలు. ప్రధానంగా ఉత్తరాదిలో అయితే ఆస్పత్రుల్లో మరణాలు కామన్‌. పదులసంఖ్యలో జనాలు చనిపోవడం.. ప్రభుత్వాలు తాపీగా స్పందించడం సాదారణమైంది. చిన్న చితకా వ్యాధులు వస్తేనే .. సరైన ట్రీట్ మెంట్ దొరకని పరిస్థితి. ఆ మధ్య .. యూపీలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి వందమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్‌లోని కోటా ఆస్పత్రి ఎంత మంది ఉసురు పోసుకుందో .... అన్నీ మనం చూశాం. 

 

ఢిల్లీ, హైదరాబాద్‌లోనూ కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఎలాంటి వైరల్ సమస్యలు వచ్చినా.. పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించి, అక్కడి నుంచి రిపోర్టులు వచ్చిన తర్వాతే నిర్ధారణ జరుగుతుంది. ఇటీవలే హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో టెస్టులు నిర్వహిస్తున్నా.. సన్నద్ధత మాత్రం నామ్‌కే వాస్తేగానే ఉంది. 

 

కరోనా తీవ్రతతో సుమారు మూడువేల ప్రాణాలు కోల్పోయిన చైనా .. ఏకంగా యుద్ధమే ప్రకటించింది. వైరస్ ప్రభావిత వుహాన్ నగరంపై పూర్తిస్థాయి ఆంక్షలు విధించింది. ఎప్పటికప్పుడు తమ శరీర ఉష్ణోగ్రతను తెలియజేయాలంటూ పౌరులు ఆదేశాలుజారీ చేసింది. ఎవరికైనా కాస్త ఫ్లూ ఉందంటే చాలు.. ప్రత్యేక వార్డులకు తరలించి చికిత్స అందించింది. అంతేనా కేవలం పదిరోజుల్లో వెయ్యి పడకల ఆస్పత్రులు నిర్మించి... వైరస్ వ్యాప్తి నివారణకు కృషి చేస్తోంది. మరి అదే ఇండియాలో సన్నద్ధత ఎంత.. మన గాంధీ ఆస్పత్రి దగ్గరకే వస్తే.. అసలు కరోనా వార్డు దగ్గర మినిమం జాగ్రత్తలు కనిపించడం లేదు. మాస్కుల కొరత వేధిస్తోంది. కరోనా పరీక్షలు, చికిత్స నిర్వహించే వార్డుల దగ్గర, ఏమాత్రం జాగ్రత్తలు కనిపించడం లేదు. ఓవైపు గాంధీలో టెస్టులు నిర్వహిస్తున్నా.. చికిత్సపై మాత్రం అనుమానాలే. అదీ ఎంతవరకూ అంటే.. కేసు నమోదైన తర్వాత ఇక్కడి వైద్యులు... కేరళలో చికిత్స అందించిన వైద్యులతో సంప్రదించేంతగా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: