ఇప్పుడు ఏపిలో వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మద్య మాటల యుద్దం నడుస్తుంది.  గతంలో టీడీపీ పాలనపై ప్రజలు విసిగి పోయారని.. నేతలు చేసిన మోసానికి ఈసారి ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టారని అన్నారు.  తాజాగా ఏపిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి లేవనెత్తిన మూడు రాజధానులపై అధికార ప్రతిపక్ష నేతల మద్య పెద్ద యుద్దమే కొనసాగుతుంది.  తాజాగా మద్యం విక్రయాల వ్యవహారంపై వైసీపీ ప్రభుత్వంపై బోండా ఉమ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 

 

గతంలో రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలలో మద్యం సిండికేట్స్ పై పెద్ద యుద్ధం జరిగింది, ఆరోజు మద్యం సిండికేట్ లో బొత్స సత్యనారాయణ లాంటి పెద్ద తలకాయలు ఉంటే, ఈరోజున సాక్షాత్తూ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లు  ఈ సిండికేట్ ను నిర్వహిస్తున్నారని ఆరోపించారు.  అయితే బోండా ఉమా చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు వైసీపీ నేతలు ఒక్కొక్కరూ తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు.  ప్రజల కోసం పాటుపడుతున్న సీఎం జగన్ పై టీడీపీ నేతలు విమర్శలు చేయడం దారుణమని వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. అధికారం కోల్పోయిన టీడీపీ నాయకులకు పిచ్చెక్కిందన్న విషయం అన్ని సందర్భాల్లో స్పష్టంగా తెలుస్తోందని విమర్శించారు.

 

ప్రజలు ఏమనుకుంటారోనన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా బోండా ఉమ ప్రెస్ మీట్ ఉందని, చాలా సిగ్గుచేటని ధ్వజమెత్తారు.  సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు.. చేస్తున్న అభివృద్ది పనులు టీడీపీ నేతలకు అస్సలు మింగుడు పడటం లేదని ఆమె తీవ్రంగా విమర్శించారు.  ఎన్నో నేరారోపణలు ఎదుర్కొన్న బోండా మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అపిస్తుందని ఎద్దేవా చేశారు.  టీడీపీ కార్యాలయంలో లిక్కర్ బ్రాండ్స్ ను తన ముందు పెట్టుకుని కూర్చున్న బోండా ఉమ.. వైన్ షాపులోనో, బార్ లోనో ఓ సేల్స్ మెన్ లా ఉన్నారని, ‘అది తెలుగుదేశం పార్టీ ఆఫీసా? లోకేశ్ వైన్ షాపా? అది పార్టీ ఆఫీసా? చంద్రన్న బెల్టు షాపా?’అనే అనుమానం తలెత్తుతోందని విమర్శించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: