తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం చంద్రబాబు హవా కొనసాగుతున్నా రానున్న రోజుల్లో ఆయన ప్రభావం అంతంత మాత్రంగానే ఉండబోతుంది. ఇప్పటికే టిడిపి నాయకులంతా ఈ విషయాన్ని గ్రహించారు. చంద్రబాబు వయసురీత్యా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం దగ్గరికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ వారసుడిగా రంగంలోకి దిగేందుకు ఎమ్మెల్సీ నారా లోకేష్ తహతహలాడుతున్నాడు. ఈ మేరకు ఇప్పటికే స్పెషల్ ట్రైనర్ ని పెట్టుకుని శిక్షణ కూడా తీసుకుంటున్నాడట. దానికి తగ్గట్లుగానే సోషల్ మీడియా ద్వారా యాక్టివ్ గా ఉంటూ లోకేష్ అధికార పార్టీపై విమర్శలు చేస్తూ జనాల్లో పాపులర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. 

 

IHG


ఇక పార్టీలోనూ పట్టు సాధించాలన్న ఉద్దేశంతో కొద్ది రోజుల క్రితం టీడీపీ సోషల్ మీడియా గ్రూప్ సమావేశం ఏర్పాటు చేసి తన ప్రాబల్యాన్ని చాటి చెప్పుకునేందుకు లోకేష్ ప్రయత్నించారు. అయితే ఈ సమావేశం ద్వారా లోకేష్ హైలెట్ అవ్వడం మాట అలా ఉంచితే ఆయన సతీమణి నారా బ్రాహ్మణి బాగా హైలెట్ అయ్యారు. ఆ సమావేశానికి హాజరైన సోషల్ మీడియా కార్యకర్తలంతా బ్రాహ్మణునితో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఇక మీడియాతో పాటు సోషల్ మీడియాలో నారా బ్రాహ్మణి త్వరలోనే టిడిపి పగ్గాలు చేపట్టి పార్టీని ముందుకు నడుస్తారని కథనాలు వెలువడ్డాయి. అయితే అసలు ఈ సమావేశం ఏర్పాటు చేసింది లోకేష్  కోసమే అయినా అకస్మాత్తుగా నారా బ్రాహ్మణి హైలెట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.


 ఈ సమావేశంలో లోకేష్ కు ఏమాత్రం ప్రాధాన్యం దక్కలేదు. బ్రాహ్మణ మాత్రం బాగా హైలెట్ అయ్యింది. అటు నందమూరి వంశం, ఇటు నారా వంశం తరఫున ఆమె ప్రాతినిధ్యం వహిస్తారు అంటూ ప్రచారం మొదలైంది. తొందర్లోనే లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగించబోతున్నారనే ప్రచారం మొదలయినా చంద్రబాబు ఇప్పుడు అకస్మాత్తుగా ఆ బ్రాహ్మణు హైలెట్ అవడంతో ఇప్పుడు ఆ విషయాన్ని బాబు వాయిదా వేసారట.

మరింత సమాచారం తెలుసుకోండి: