రెవెన్యూ అధికారుల విచారణలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సోదరుల కబ్జాల భాగోతం బట్టబయలైంది. ప్రభుత్వ ప్రైవేటు భూములను ఆఖరికి చెరువులను సైతం వదల్లేదు ఈ కబ్జా బ్రదర్స్ 1955 నుండి డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత రేవంత్ రెడ్డి సోదరుల భూదందా బయటపడింది. అధికారులను అసలు హక్కుదారులు భయపెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు వాస్తవాలు బయటపడ్డాయి. ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు రెవెన్యూ అధికారులు. గోపన్ పల్లి లో భూములను కబ్జా చేశారని రేవంత్ రెడ్డి సోదరుల పై ఆరోపణలు వచ్చాయి. బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టారు.

 

దీంతో ప్రభుత్వం రెవెన్యూ అధికారులతో విచారణ చేయించింది. విచారణలో రేవంత్ సోదరుల కబ్జా నిజమే అని తేలింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం పరిశీలించిన అధికారులు అసలు భూమి ఆకు దారుడు ఒడ్డె అనే వ్యక్తి పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా జరిపిన సర్వేల్లో డాక్యుమెంట్లు కూడా సరిగ్గా లేవని ఈ విచారణలో గుర్తించారు. ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఈ భూకబ్జా రేవంత్ సోదరుడు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పలు సర్వేల ప్రకారం వీళ్ళు చేసిన అవినీతి బాగోతం అంతా ఆర్డీవో చంద్రకళ బయటపెట్టారు. 18 పేజీల నివేదిక కలిగిన డాక్యుమెంట్లను రేవంత్ రెడ్డి సోదరులు చేసిన భూ దందాలు ఆధారాలతో సహా బయట పెట్టి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి ఆర్డీవో ఇవ్వటం జరిగింది.

 

అంతేకాకుండా రేవంత్ రెడ్డి పై కఠినమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సూచించడం జరిగింది. కబ్జా చేసిన భూముల్లో కట్టిన గోడలను వెంటనే కూల్చేయాలని నివేదికలో కోరారు. నివేదికలో ప్రతి విషయాన్ని ఆధారాలతో సహా సర్వే చేసే మరి ఆర్ డి ఓ రేవంత్ రెడ్డి సోదరుడు భూ కబ్జా చేశారని తేల్చిపారేశారు. దీంతో రేవంత్ రెడ్డి సోదరులకు మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చినట్లు అయింది. కేసీఆర్ ఫామ్ హౌస్ విషయంలో రెచ్చిపోయిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు తాను చేసిన భూకబ్జా మొత్తం ఆధారాలతో సహా బయటపడడంతో నోటి మాట రాకుండా పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: