విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా దెబ్బతిందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రావలసిన నిధులను వెంటనే రిలీజ్ చేయాలని కేంద్రాన్ని కోరినట్లు ఇటీవల తెలిపారు. తాజాగా ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమైన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక లోటు గురించి వివరంగా చెప్పినట్లు బుగ్గన తెలిపారు. సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసి.. ఆ డబ్బులను ఇతర పనులకు వినియోగించిందని విమర్శించారు.

 

దీంతో సివిల్‌ సప్లై కార్పొరేషన్‌కు మార్కెట్‌ నుంచి డబ్బులు సమకూరే పరిస్థితి లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా ఆలస్యమవుతున్నాయని చెప్పారు. ధాన్యం సేకరణ నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కేంద్రానికి వివరించినట్టు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. వెనకబడిన జిల్లాలకు నిధులు కేటాయించడంతోపాటు.. రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ కు నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరినట్లు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కూడా కేంద్ర మంత్రితో చర్చించినట్లు విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని గుర్తు చేసినట్లు పేర్కొన్నారు.

 

ఖచ్చితంగా రాష్ట్రానికి ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఇంకా అనేక విషయాల గురించి ముఖ్యంగా చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో పరిపాలనా సమయంలో జరిగిన అవకతవకల గురించి నిర్మలా సీతారామన్ తో జరిగిన భేటీలో అనేక విషయాలు చర్చించినట్లు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. విభజనకు నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వమే ఆదుకోవాలి సరైన సమయంలో నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేసినట్లు మొత్తంమీద చెప్పుకొచ్చారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: