ఏపీ సీఎం జగన్ మరోసారి ప్రధాని మోడీకి జలక్ ఇవ్వబోతున్నారు. ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌, సీఏఏ అంశాలపై దేశవ్యాప్తంగా ఆందోళన పెల్లుబుకుతున్న వేళ.. ఏపీలోనూ ఈ అంశాలపై మైనారిటీలు ఆందోళనతో ఉన్నారు. ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌, సీఏఏలకు వ్యతిరేకంగా ఏపీలోనూ పెద్ద ఎత్తున ముస్లింలు సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

 

 

గతంలో సీఏఏ సవరణ చట్టం రూపొందేవేళ వైసీపీ ఈ చట్టానికి మద్దతు ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఈ అంశంలో వైసీపీ కాస్త ఇబ్బందిపడుతోంది. దీంతో ఆ పార్టీ టార్గెట్ గా నేతలు విమర్శలు ప్రారంభించారు. ఇటీవల ఏపీలో జరిగిన ఓ సభలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ జగన్ కు మోడీ అంటే భయమని.. అదే వైఎస్సార్ ఉంటే రెండు నిమిషాల్లో ఈ చట్టాన్ని ఆపేసేవాడని కామెంట్ చేశారు.

 

 

ఈ నేపథ్యంలో జగన్ ఓ కీలక ప్రకటన చేశారు. ఎన్‌పీఆర్‌ చట్టంపై మైనారీటీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సీఎం ఓ ప్రకటన విడుదల చేసారు. ఎన్‌పీఆర్‌లో ప్రతిపాదించడ్డ కొన్ని ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మైనారిటీల్లో అభద్రతా భావాన్ని కలుగజేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

 

 

ఈ అంశంపై పార్టీలో విస్తృతంగా చర్చ జరిపామని... 2010లోని నిబంధనలనే ఇప్పుడు కూడా పాటించాలని కేంద్రాన్ని కోరతామని ఆయన అన్నారు. అంతే కాదు.. దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని కూడా సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రకటనలో తెలిపారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: