బిసి రిజర్వేషన్లపై సుప్రింకోర్టుకు వెళ్ళాలని ప్రతిపక్షాలు ప్రధానంగా చంద్రబాబునాయుడు పదే పదే డిమాండ్ చేయటంలో ఉద్దేదశ్యమేమిటో తెలుసా ? స్ధానిక సంస్ధల ఎన్నికలను వాయిదా వేయించటమే. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా రిపీటవుతుందని చంద్రబాబు, టిడిపి నేతల్లో భయం మొదలైంది. అందుకనే ఎలాగైనా స్ధానిక సంస్ధల ఎన్నికలను ఎలాగైనా సరే వాయిదా వేయించానే పట్టుదల చంద్రబాబులో కనిపిస్తోంది.

 

తమలోని భయాన్ని బయటపెట్టకుండా రాజ్యాంగమని, బిసిలకు న్యాయం చేయాలని సుప్రింకోర్టుకు వెళ్ళాల్సిందే అంటూ సొల్లు కబుర్లు చెబుతున్నారు. బిసిలపై చంద్రబాబుకు నిజంగానే అంత ప్రేముంటే తన మద్దతుదారుడు బిర్రు ప్రతాప్ రెడ్డితో రిజర్వేషన్లపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు కోర్టులో కేసు వేయించినట్లు ? జగన్మోహన్ రెడ్డితో పిటీషనర్ దిగిన ఫొటోను పట్టుకుని కేసు వేసింది జగన్ కు సన్నిహితుడే అనే సొల్లు వాదనను చంద్రబాబు  తెరపైకి తేవటమే విచిత్రంగా ఉంది.

 

పిటీషనర్ టిడిపి జడ్పిటిసిగా పనిచేశాడని, పంచాయితీ రాజ్ చాంబర్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడని, నామినేటెడ్ పదవిలో కూడా ఉన్నాడని కనబడుతున్న ఆధారాలను మాత్రం పట్టించుకోవటం లేదు. ఎప్పుడైతే పిటీషనర్ తనకు సన్నిహితుడన్న విషయం బయటపడగానే చంద్రబాబు, టిడిపి నేతలు ఉలిక్కిపడ్డారు. నిజానికి వాళ్ళే ప్రతాప్ రెడ్డితో చెప్పి కేసు వేయించారన్న విషయం బయటపడింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగారు.

 

మొత్తానికి స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగటం చంద్రబాబకు ఇష్టం లేదని అర్ధమైపోతోంది. అందుకనే ప్రభుత్వాన్ని సుప్రింకోర్టుకు వెళ్ళమని రెచ్చగొడుతున్నారు. ప్రభుత్వం గనుక సుప్రింకోర్టుకు వెళితే ఎలాగూ ఎన్నికలపై స్టే వస్తుంది. దాంతో ఇక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఎవరు చెప్పలేరు. చంద్రబాబు అండ్ కో కు కావాల్సింది ఇదే. లేకపోతే ఎన్నికలను వైసిపి స్వీప్ చేస్తుందని వాళ్ళకు అర్ధమైపోయింది. ఎన్నికలు నిర్వహించమని డిమాండ్ చేయాల్సిన చంద్రబాబు సుప్రింకోర్టుకు వెళ్ళమని రెచ్చగొట్టడంలో అర్ధమిదే.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: