కరోనా వైరస్.. చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికించేస్తోంది. ఎన్నో వేలమంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఈ వైరస్ ప్రపంచమంతా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. అలాంటి ఈ దారుణమైన వైరస్ ప్రస్తుతం భారత్ ప్రజలను కూడా వణికిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటలీ నుండి జైపూర్‌కు వచ్చిన పర్యాటకుల్లో భార్యాభర్తలిద్దరు కరోనా బారిన పడ్డారు. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటలీ నుండి జైపూర్‌కు వచ్చిన పర్యాటకుల్లో భార్యాభర్తలిద్దరికీ కరోనా సోకడం స్థానికంగా కలకలం సృష్టించింది. మొదట జైపూర్ కు చేరిన ఇటలీ పర్యాటక బృందంలో అధికారులు ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకడం గుర్థించరు. దీంతో అతడికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది.

 

దీంతో అతన్ని జైపూర్‌లోని ఎస్‌ఎంఎస్‌ ఆస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. ఈ క్రమంలో తాజాగా అతడి భార్యకు కూడా అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఆమెకు సైతం కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆమె రక్త నమూనాలను మరోసారి పరీక్షల నిమిత్తం పుణెలోని ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు వెల్లడించారు. 

 

అయితే ఆ బార్యాభర్తలతో పాటు మరో 21 మంది పర్యాటకులు సహా, 3 భారతీయుల్ని ఆరోగ్య శాఖ అధికారులు ఐటీబీపీ పరీక్షా కేంద్రానికి తరలించారు. మరి వారిలో ఎంతమంది సేఫ్ అనేది ఇంకా తెలియలేదు. కాగా ఈ కరోనా వైరస్ ప్రస్తుతం ప్రజలను బయపెట్టేస్తోంది. ప్రజలందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి అని వైద్యులు, అధికారులు కూడా సూచిస్తున్నారు.

 

తినే ముందు తప్పనిసరిగా చేతులు కడగాలి అని.. తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని.. బయటకు వెళ్లిన సమయంలో ముఖానికి మాస్క్ ధరించడం ఎంతైనా అవసరం ఉంది అని.. వీలైనంత బయట ఆహారంను తీసుకోకపోవడం మంచిది అని.. కొద్దిరోజులు శాకాహారం తీసుకుంటే ఎంతోమంచిది అని వైద్యులు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: