ప్రపంచాన్ని పరేషాన్ చేస్తున్న భయంకరమైన విషయం ఏంటంటే కరోనా వైరస్ అనే టాపిక్.. ఇది జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.. ఎవరైనా పక్కన వచ్చి దగ్గినా, తుమ్మినా వారికి కరోనా సోకిందేమోనన్న అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతోంది. ఈ కరోనా వల్ల మానవ సంబంధాలు, బంధాలు అన్ని భయం భయంగా మారాయి.. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని స్దితి ఇప్పుడు ప్రపంచంలో నడుస్తుంది.. కనీసం మనసు విప్పి మాట్లాడాలన్నా సంకోచాలే కలుగుతున్నాయి.. అయితే ఇంతలా అన్ని దేశాలను సతమతం చేస్తున్న ఈ కొవిడ్-19 ఆలియాస్ కరోనా ఒక్క అంటార్కిటికా తప్ప అన్ని ఖండాలకూ పాకింది.

 

 

ఇదిలా ఉండగా.. లిథుయానియాలో ఒక వ్యక్తి తన భార్యకు కరోనా సోకిందనే భయంతో ఆమెను బాత్‌రూంలో బంధించాడు. ఇటలీ నుంచి వచ్చిన ఓ చైనా మహిళతో తన భార్య మాట్లాడినట్టు.. ఈ కారణంగా ఆమెకు కూడా వైరస్ సోకిందనే అనుమానంతో భర్త ఈ దారుణమైనా పనిచేశాడు. ముందుగా భర్త డాక్టర్‌కు ఫోన్ చేసి తన భార్యకు కరోనా సోకిందని.. తనకు కూడా ఆ మహమ్మారి సోకకుండా ఏం చేయాలని అడిగాడట.. దానికి సమాధానంగా మీ భార్యకు ముందుగా మెడికల్ టెస్ట్‌లు నిర్వహించాలని.. అంతకంటే ముందు ఆమె ఎక్కడికీ వెళ్లకుండా జాగ్రత్తగా చూడమని చెప్పడంతో భర్త ఈ నిర్వాకానికి పాల్పడ్డాడట..

 

 

ఇక అతని చర్యకు విసిగిన ఇతని భార్య వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. అక్కడకు చేరుకున్న పోలీసులు జరిగింది తెలుసుకుని, వెంటనే ఆ మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించగా, ఆవిడకు ఎటువంటి వైరస్ సోకలేదని తేలిందట.. చూసారా కరోనా దెబ్బ ప్రతివారికి ఎలా చాచి కొడుతుందో.. దీని ప్రభావానికి కట్టుకున్న వారినే అనుమానించే పరిస్దితులను కల్పిస్తుంది.. ఈ వైరస్ పూర్తిగా అంతం అయితే కానీ బీటలు వారుతున్న బందాలు తిరిగి అతుక్కోవు..

మరింత సమాచారం తెలుసుకోండి: